Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145618
            [news_title_telugu_html] => 

దీన్ని రహస్యంగానే ఉండనిద్దాం..

[news_title_telugu] => దీన్ని రహస్యంగానే ఉండనిద్దాం.. [news_title_english] => You cant have just one strategy when you play Lin Dan says prannoy [news_short_description] => చైనా దిగ్గజ ఆటగాడు లిన్‌ డాన్‌ను ఓడించాలంటే వ్యూహాలు పక్కాగా పన్నాలని భారత అగ్రశ్రేణి షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అన్నాడు. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన రెండో రౌండ్‌లో అతడు 21-11, 13-21, 21-7 తేడాతో.... [news_tags_keywords] => Lin Dan,hs prannoy,world badminton championship [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-21 15:43:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
దీన్ని రహస్యంగానే ఉండనిద్దాం.. - You cant have just one strategy when you play Lin Dan says prannoy - EENADU
close

తాజా వార్తలు

దీన్ని రహస్యంగానే ఉండనిద్దాం..

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): చైనా దిగ్గజ ఆటగాడు లిన్‌ డాన్‌ను ఓడించాలంటే వ్యూహాలు పక్కాగా పన్నాలని భారత అగ్రశ్రేణి షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అన్నాడు. బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన రెండో రౌండ్‌లో అతడు 21-11, 13-21, 21-7 తేడాతో ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ డాన్‌ను చిత్తుచేసిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ 5 మ్యాచుల్లో తలపడగా ప్రణయ్‌ మూడు సార్లు గెలవడం గమనార్హం.

డాన్‌పై ఎలాంటి వ్యూహం అమలు చేశావని ప్రశ్నించగా ‘వ్యూహం గురించి నేను బహిరంగంగా చెప్పలేను. దీన్ని రహస్యంగానే ఉండనిద్దాం (నవ్వులు)’ అని ప్రణయ్‌ అన్నాడు. ‘అతడిని ఓడించాలంటే ఒక్క వ్యూహమే సరిపోదు. చాలా ఎంచుకోవాలి. నేనూ అలాగే చేశాను. వాటన్నిటినీ నేను సరైన సమయంలో, సరైన పద్ధతిలో అమలు చేశాను. ప్రతి పాయింట్‌ను ఊహించేలా చేశాను. 20 ఏళ్లుగా డాన్‌ను మనం చూస్తున్నాం. నేను చాలా దగ్గర్నుంచి అతడిని గమనించా. సాంకేతికంగా అతడు అత్యున్నత నిపుణుడు. ఏ పరిస్థితికైనా అలవాటు పడగలడు కోర్టులో మనల్ని కష్టపెట్టగలడు’ అని ప్రణయ్‌ పేర్కొన్నాడు.

‘డాన్‌పై నాకిది మూడో విజయం. చాలా వ్యూహాలు అతడిపై ప్రయోగించాను. మీరు నా గేమ్‌ వీడియో ఫుటేజీ చూస్తే నేనతడి కళ్లలోకి చూసింది చాలా తక్కువ. మూడో గేమ్‌ చాలా సులభంగా అనిపిస్తుంది కానీ అదంతా పక్కా ప్రణాళిక, వ్యూహాలతో సాగింది. తొలి అర్ధభాగం ఆధిక్యంలో ఉండాలని పోరాడా. పెద్ద టోర్నీల్లో డాన్‌కు తిరుగులేదు. కానీ ఇది నా రోజు’ అని ప్రణయ్‌ తెలిపాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.