Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 145573
            [news_title_telugu_html] => 

17 ఏళ్ల రికార్డును భారత్‌ కొనసాగిస్తుందా?

[news_title_telugu] => 17 ఏళ్ల రికార్డును భారత్‌ కొనసాగిస్తుందా? [news_title_english] => India look to maintain 17-year unbeaten record in Test cricket against West Indies [news_short_description] => సుదీర్ఘ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా 2002 నుంచి మట్టికరిపిస్తోంది. 1948-49 నుంచి మొదలైన విండీస్‌xభారత్‌ టెస్టు పోరులో కరీబియన్లదే పైచేయి. [news_tags_keywords] => India,West Indies,Virat Kohli,World Test Championship [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 00:36:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
17 ఏళ్ల రికార్డును భారత్‌ కొనసాగిస్తుందా? - India look to maintain 17-year unbeaten record in Test cricket against West Indies - EENADU
close

తాజా వార్తలు

17 ఏళ్ల రికార్డును భారత్‌ కొనసాగిస్తుందా?

ఆంటిగ్వా: సుదీర్ఘ ఫార్మాట్‌లో వెస్టిండీస్‌ను టీమిండియా 2002 నుంచి మట్టికరిపిస్తోంది. 1948-49 నుంచి మొదలైన విండీస్‌xభారత్‌ టెస్టు పోరులో కరీబియన్లదే పైచేయి. ఇప్పటివరకు ఇరుజట్లు 23 టెస్టు సిరీసుల్లో తలపడగా విండీస్‌ 12, భారత్ 9 సార్లు సిరీస్‌ను కైవసం చేసుకున్నాయి. కానీ గత 17 ఏళ్లుగా విండీస్ చేతిలో భారత్‌ ఒక్క టెస్టు సిరీస్‌ను కూడా కోల్పోలేదు. రేపటి నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌ను కూడా కోహ్లీ సేన తన ఖాతాలో వేసుకుంటే వెస్టిండీస్‌పై 17 ఏళ్లగా విజయపరంపర కొనసాగిస్తున్న జట్టుగా రికార్డు సృష్టిస్తుంది. ఇప్పటికే భారత్‌ టీ20, వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసింది. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఈ సిరీస్‌తోనే మొదలవ్వడంతో ఇరుజట్లకు ఇది ఎంతో కీలకం కానుంది. 

విండీస్‌తో జరగునున్న టెస్టు సిరీస్‌ను టీమిండియా గెలిస్తే కోహ్లీ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. వెస్టిండీస్‌లో రెండు టెస్టుల సిరీస్‌ను గెలిచిన తొలి భారత సారథిగా అతడు రికార్డు సృష్టిస్తాడు. 2016లో వెస్టిండీస్‌తో జరిగిన నాలుగు టెస్టు మ్యాచుల సిరీస్‌లో కోహ్లీసేన 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతేకాకుండా ధోనీ రికార్డుపై కూడా కోహ్లీ కన్నేశాడు. టెస్టుల్లో ధోని 60 మ్యాచుల్లో 27 మ్యాచులు విజయం సాధించగా కోహ్లి 46 మ్యాచుల్లోనే 26 మ్యాచులు గెలిచాడు. మరో మ్యాచ్‌ విజయం సాధిస్తే  ధోనీ రికార్డును ఈ రికార్డుల రారాజు సమం చేస్తాడు.

2014 డిసెంబర్‌లో టెస్టు సారథి బాధ్యతలను అందుకున్న కోహ్లీ కెప్టెన్‌గా మరో రికార్డు సాధించాడు. 2016 నుంచి జరిగిన టెస్టుల్లో గెలుపు-ఓటముల శాతంలో 2.875తో భారత్‌ను అగ్రస్థానంలో నిలబెట్టాడు. 2016 నుంచి ఇప్పటివరకు కోహ్లీ 38 మ్యాచులకు జట్టు పగ్గాలను అందుకోగా 23 గెలిచి, 8 మ్యాచుల్లో ఓటమిని చవిచూశాడు. భారత్ తర్వాతి స్థానంలో ఇంగ్లాండ్‌ నిలిచింది. ఇంగ్లాండ్‌ 47 మ్యాచుల్లో 21 విజయం సాధించింది. వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా టీమిండియా రేపు ఆంటిగ్వాలో తొలి టెస్టును ఆడనుంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.