Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146175
            [news_title_telugu_html] => 

రోహిత్‌ × రహానె సందిగ్ధం: దాదా సలహా ఇదీ

[news_title_telugu] => రోహిత్‌ × రహానె సందిగ్ధం: దాదా సలహా ఇదీ [news_title_english] => Rohit Sharma should be tried as opener in Tests says Sourav Ganguly [news_short_description] => సచిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌ తర్వాత టీమిండియాకు దొరికిన అద్భుతమైన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ. సొగసరి షాట్లతో క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరూ చేయనన్ని ద్విశతకాలతో దుమ్మురేపాడు. పరిమిత ఓవర్ల..... [news_tags_keywords] => Rohit Sharma,Sourav Ganguly,virat kohli,Ajinkya Rahane [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 17:16:23 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రోహిత్‌ × రహానె సందిగ్ధం: దాదా సలహా ఇదీ - Rohit Sharma should be tried as opener in Tests says Sourav Ganguly - EENADU
close

తాజా వార్తలు

రోహిత్‌ × రహానె సందిగ్ధం: దాదా సలహా ఇదీ

ముంబయి: సచిన్‌, గంగూలీ, సెహ్వాగ్‌ తర్వాత టీమిండియాకు దొరికిన అద్భుతమైన ఓపెనర్‌ రోహిత్‌ శర్మ. సొగసరి షాట్లతో క్రికెట్‌ ప్రపంచంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎవరూ చేయనన్ని ద్విశతకాలతో దుమ్మురేపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో చెలరేగి ఆడే హిట్‌మ్యాన్‌కు సుదీర్ఘ ఫార్మాట్‌ మాత్రం అచ్చిరాలేదు. అప్పుడప్పుడూ అవకాశాలు వచ్చినా జట్టులో స్థానం సుస్థిరం చేసుకోలేకపోయాడు. వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌లోనూ ఇదే సందిగ్ధం. తుది జట్టులో ఉంటాడా? ఉండడా? వైస్‌ కెప్టెన్‌ రహానెను తొలగించి అతడిని కొనసాగించగలమా?అని జట్టు యాజమాన్యం మల్లగుల్లాలు పడుతోంది. దాదా ఈ చిక్కుముడిని విప్పే ప్రయత్నం చేశారు!

‘విరాట్‌ సేనకు ఇది కొత్త ఆరంభం. టెస్టు ఫార్మాట్‌నే ఎందుకు అత్యుత్తమంగా పరిగణిస్తారని సందేహాలు రావొచ్చు. ఒకసారి యాషెస్‌ సిరీస్‌ చూస్తే మీ సందేహాలన్నీ పటాపంచలవుతాయి. ప్రస్తుతం టీమిండియాకు రోహిత్‌, రహానె విషయంలో ఏం చేయాలో అర్థం కావడం లేదు. దక్షిణాఫ్రికాలోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. నా సలహా ఏంటంటే ప్రపంచకప్‌లోని రోహిత్‌ ఫామ్‌ను టెస్టుల్లో ఓపెనర్‌గా ఇలాగే కొనసాగనివ్వండి. రహానె తన అద్భుతమైన టెక్నిక్‌, బ్యాటింగ్‌తో మిడిలార్డర్‌కు స్థిరత్వం తీసుకొచ్చేలా చూడండి’ అని గంగూలీ అన్నారు. ఐతే ప్రస్తుతం ఓపెనింగ్‌ స్థానాలకు మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, హనుమ విహారి పోటీపడుతున్న సంగతి తెలిసిందే.

‘భారత్‌కు జట్టు కూర్పే కీలకం. వృద్ధిమాన్‌ సాహా కన్నా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో టెస్టు క్రికెట్‌లో అదరగొట్టిన రిషభ్‌పంత్‌ మెరుగు. హార్దిక్‌ పాండ్య స్థానాన్ని రవీంద్ర జడేజా చక్కగా వినియోగించుకోవాలి. బ్యాటర్‌గా, రెండో స్పిన్నర్‌గా జట్టుకు ఉపయోగపడాలి. ఇషాంత్‌, బుమ్రాకు చోటు ఖాయం. భువనేశ్వర్‌ కాకుండా షమికే నేను ఓటేస్తాను. టెస్టు క్రికెట్‌లో అతడి సామర్థ్యం బాగుంది. స్పెషలిస్టు స్పిన్నర్‌గా అనుభవం ఉన్న అశ్విన్‌ను తీసుకోవాలి. మళ్లీ పాత అశ్విన్‌-జడ్డూ జోడీని చూడొచ్చు’ అని దాదా సూచించారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.