Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146193
            [news_title_telugu_html] => 

ఊరించే పిచ్‌లపై ఆ బంతులతో కోహ్లీసేనకు కష్టమే!

[news_title_telugu] => ఊరించే పిచ్‌లపై ఆ బంతులతో కోహ్లీసేనకు కష్టమే! [news_title_english] => Gautam gambhir says Dukes ball will make it tough for India in Windies [news_short_description] => ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో తలపడుతోంది. ఐతే ఊరించే కరీబియన్‌ పిచ్‌లపై డ్యూక్‌ బంతులతో ఆడటం టీమిండియాకు సవాలేనని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు..... [news_tags_keywords] => Gautam Gambhir,INDvsWI,kl rahul,hanuma vihari,duke balls [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 17:09:35 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఊరించే పిచ్‌లపై ఆ బంతులతో కోహ్లీసేనకు కష్టమే! - Gautam gambhir says Dukes ball will make it tough for India in Windies - EENADU
close

తాజా వార్తలు

ఊరించే పిచ్‌లపై ఆ బంతులతో కోహ్లీసేనకు కష్టమే!

ముంబయి: ఐసీసీ టెస్టు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌నకు టీమిండియా సిద్ధమైంది. వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్‌లో తలపడుతోంది. ఐతే ఊరించే కరీబియన్‌ పిచ్‌లపై డ్యూక్‌ బంతులతో ఆడటం టీమిండియాకు సవాలేనని మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నాడు. బ్యాట్స్‌మెన్‌ ఆచితూచి ఆడాలని సూచించాడు. బౌలర్లు అవకాశాలను అందిపుచ్చుకోవాలని పేర్కొన్నాడు.

‘వెస్టిండీస్‌లో టెస్టు క్రికెట్‌ పరిస్థితులు అత్యంత భిన్నంగా ఉంటాయి. కాబట్టి భారత బ్యాట్స్‌మెన్‌ మంచి నైపుణ్యాలు ప్రదర్శించాలి. ఆతిథ్య జట్టు డ్యూక్‌ బంతులకే కట్టుబడి ఉండటం మంచి నిర్ణయం. గతంలో విండీస్‌ కూకాబుర్ర బంతులు వినియోగించేది. డ్యూక్‌ బ్రిటన్‌ కంపెనీ. కూకాబుర్రతో పోలిస్తే ఇవి గట్టి సవాళ్లు విసురుతాయి. కరీబియన్‌ జట్టు ఇంగ్లాండ్‌ను ఓడించిన సిరీస్‌లో పిచ్‌లు ఊరించాయి. టీమిండియా సిరీస్‌లోనూ అలాంటి పిచ్‌లే ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి పరిస్థితుల్లో కోహ్లీసేన కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌ను ఓపెనింగ్‌ చేయించాలి. టాప్‌ ఆర్డర్‌లో పంపించి హనుమ విహారి కెరీర్‌ను ప్రమాదంలో పడేయొద్దు’ అని గౌతీ సూచించాడు.

వెస్టిండీస్‌లో వన్డే, టీ20 సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసిన టీమిండియా ప్రస్తుతం టెస్టు సిరీస్‌పై కన్నేసింది. ఏడున్నర నెలల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్‌ ఆడుతోంది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్‌లో కోహ్లీసేన చారిత్రక విజయం అందుకున్న సంగతి తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.