Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000037
            [news_title_telugu_html] => 

ఆదిలోనే వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తాం

[news_title_telugu] => ఆదిలోనే వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తాం [news_title_english] => Kemar Roach says that they Will try to take early wickets in morning session [news_short_description] => భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో గురువారం ఉదయం టీ విరామానికి ముందు పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకొని వికెట్లు తీశామని విండీస్‌ బౌలర్‌ కీమర్‌ రోచ్‌ పేర్కొన్నాడు... [news_tags_keywords] => Test Cricket ,INDvsWI ,Kemar Roach ,Test Championship [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 18:44:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆదిలోనే వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తాం - Kemar Roach says that they Will try to take early wickets in morning session - EENADU
close

తాజా వార్తలు

ఆదిలోనే వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తాం

రెండో రోజు ఆటపై విండీస్‌ బౌలర్‌ కీమర్‌ రోచ్‌

ఆంటిగ్వా: భారత్‌తో జరుగుతోన్న తొలి టెస్టులో గురువారం ఉదయం టీ విరామానికి ముందు పిచ్‌పై ఉన్న తేమను సద్వినియోగం చేసుకొని వికెట్లు తీశామని విండీస్‌ బౌలర్‌ కీమర్‌ రోచ్‌ పేర్కొన్నాడు. రెండో రోజూ ఆదిలోనే వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. తొలి రోజు మూడు వికెట్లు తీసిన కీమర్‌ వెస్టిండీస్‌కు శుభారంభం ఇచ్చాడు. ఐదో ఓవర్‌లో మయాంక్‌ అగర్వాల్‌(5), ఛెతేశ్వర్‌ పుజారా(2)లను పెవిలియన్‌ చేర్చిన అతడు తర్వాత హనుమ విహారి(32)ని ఔట్‌ చేశాడు. దీంతో తొలి రోజు 34 పరుగులు ఇచ్చి మూడు కీలక వికెట్లు పడగొట్టాడు. 

మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ.. ఆంటిగ్వా పిచ్‌ సాధారణంగానే ఉంటుందని, తొలి సెషన్‌లో పిచ్‌పై ఉండే తేమ ఫాస్ట్‌ బౌలర్లకు కలిసి వస్తుందని చెప్పాడు. ఆ విధంగానే తొలి రోజు మంచి ప్రదర్శన చేశామని అన్నాడు. ఈ పిచ్‌పై తనకు మంచి అనుభవం ఉందని, అందుకే ఇక్కడ ఆడేందుకు ఇష్టపడతానని తెలిపాడు. మొదట్లో తేమ వల్ల కలిసి వచ్చినా తర్వాత పిచ్‌ స్వభావం మారి బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా మారిందని వెల్లడించాడు. ఓపిగ్గా ఉండి వికెట్లు తీయడమే ముఖ్యమని అందుకోసం కష్టపడాల్సి వచ్చిందని వివరించాడు.

మొత్తం మీద విండీస్‌ జట్టు తొలి రోజు ఆధిపత్యం చెలాయించిందని, టీమిండియాను 203/6 కట్టడి చేయడంతో తమ బౌలర్లు మంచి ప్రదర్శన చేశారని మెచ్చుకున్నాడు. ఇక రెండో రోజు తొలి సెషన్‌ ఎంతో కీలకమని, జడేజా, రిషభ్‌ పంత్‌ తమపై ఆధిపత్యం చెలాయించకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ని సైతం మరో 50-60 పరుగులలోపు కట్టడి చేసి.. ఆపై తమ బ్యాట్స్‌మెన్‌ భారీ స్కోర్‌ సాధించాలని చెప్పుకొచ్చాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.