Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000047
            [news_title_telugu_html] => 

ఆర్సీబీ డైరెక్టర్‌గా మైక్‌ హెసన్‌

[news_title_telugu] => ఆర్సీబీ డైరెక్టర్‌గా మైక్‌ హెసన్‌ [news_title_english] => Mike Hesson as Director of Cricket Operations for RCB and Simon Katich as head coach [news_short_description] => ఐపీఎల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఫ్రాంఛైజీ కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ప్రస్తుతమున్న గ్యారీకిర్‌స్టెన్‌ స్థానంలో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ మాజీ కోచ్‌‌, న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ను... [news_tags_keywords] => RCB ,IPL ,Mike Hesson,Virat Kohli [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 23:33:17 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఆర్సీబీ డైరెక్టర్‌గా మైక్‌ హెసన్‌ - Mike Hesson as Director of Cricket Operations for RCB and Simon Katich as head coach - EENADU
close

తాజా వార్తలు

ఆర్సీబీ డైరెక్టర్‌గా మైక్‌ హెసన్‌

ప్రధాన కోచ్‌గా సైమన్‌ కటిచ్‌

బెంగళూరు: ఐపీఎల్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు ఫ్రాంఛైజీ కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ప్రస్తుతమున్న గ్యారీ కిర్‌స్టెన్‌ స్థానంలో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ మాజీ కోచ్‌‌, న్యూజిలాండ్‌ మాజీ కోచ్‌ మైక్‌ హెసన్‌ను నూతన డైరెక్టర్‌గా ఎంపిక చేసింది. అలాగే ప్రధాన కోచ్‌ ఆశిష్‌నెహ్రా స్థానంలో ఆసీస్‌ మాజీ క్రికెటర్‌ సైమన్‌ కటిచ్‌ను తీసుకుంది. ఏటా ఆర్సీబీ.. ఐపీఎల్‌లో ఫేవరెట్‌ జట్టుగా బరిలోకి దిగుతూ అభిమానులను నిరాశ పరుస్తున్న సంగతి తెలిసిందే. కోహ్లీ సారధ్యంలోని ఆ జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లు ఉన్నా ఇప్పటికీ టైటిల్‌ గెలవకపోవడం గమనార్హం. 

కొత్త డైరెక్టర్‌ నియమకంపై ఆర్సీబీ ఛైర్మన్‌ సంజీవ్‌ చురివాలా మాట్లాడుతూ.. తమ ఫ్రాంఛైజీ ఉద్దేశం ఒక్కటేనని, అత్యంత విశ్వసనీయమైన, గౌరవమైన, ఉత్తమ టీ20 జట్టుగా ఆర్సీబీని తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. అందుకోసం తమ సిబ్బందికి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఇకపై ఆర్సీబీ బాధ్యతలు మొత్తం అతడికి అప్పగిస్తున్నామని, ఆటగాళ్లను సమన్వయం చేసుకుంటూ అందరితో కలిసిపోతాడని అన్నారు. జట్టు కార్యకలాపాలతో పాటు నిర్వహణ, పనితీరు, ఆటగాళ్ల ప్రదర్శన అన్నింటికీ అతడే బాధ్యత వహిస్తాడని సంజీవ్‌ తెలిపారు.

ఇదిలా ఉండగా మైక్‌ హెసన్‌ ఇటీవల టీమిండియా ప్రధాన కోచ్‌ పదవికి దరఖాస్తున్న చేసుకున్న విషయం తెలిసిందే. బీసీసీఐ క్రికెట్‌ సలహా కమిటీ నేతృత్వంలో నిర్వహించిన ఇంటర్వ్యూల్లో రవిశాస్త్రి తొలి స్థానం సంపాదించగా హెసన్‌ రెండో స్థానంలో నిలిచాడు. ఇద్దరి మధ్యా స్వల్ప తేడా ఉన్నప్పటికీ రవిశాస్త్రి ప్రెజంటేషన్‌ బాగుందని, అందుకే అతడిని  తిరిగి ఎంపిక చేస్తున్నామని కమిటీ పేర్కొంది. మరోవైపు న్యూజిలాండ్‌ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన హెసన్‌ ఆ జట్టును అన్ని విభాగాల్లో మెరుగుపరిచాడు. 2015 ప్రపంచకప్‌లో ఆ జట్టు ఫైనల్స్‌ చేరడం వెనుక అతడు కీలక పాత్ర పోషించాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.