Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000068
            [news_title_telugu_html] => 

యాషెస్‌ టెస్టు: 67కే ఇంగ్లాండ్‌ ఆలౌట్‌

[news_title_telugu] => యాషెస్‌ టెస్టు: 67కే ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ [news_title_english] => England collapsed for less score in first innings against Australia [news_short_description] => ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలిరోజు 179 పరుగులకే ఆలౌటైన ఆసీస్‌ జట్టు శుక్రవారం ఇంగ్లాండ్‌ బ్యా్ట్స్‌మెన్‌... [news_tags_keywords] => Ashes Series ,ENGvsAUS ,David Warner ,Jofra Archer [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 19:52:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
యాషెస్‌ టెస్టు: 67కే ఇంగ్లాండ్‌ ఆలౌట్‌ - England collapsed for less score in first innings against Australia - EENADU
close

తాజా వార్తలు

యాషెస్‌ టెస్టు: 67కే ఇంగ్లాండ్‌ ఆలౌట్‌

విజృంభించిన ఆసీస్‌ బౌలర్లు

లీడ్స్‌: ఇంగ్లాండ్‌ X ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతోన్న మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. తొలిరోజు 179 పరుగులకే ఆలౌటైన ఆసీస్‌ జట్టు శుక్రవారం ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ పని పట్టింది. హాజిల్‌వుడ్‌(5), ప్యాట్‌ కమ్మిన్స్‌(3) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడి.. ఆతిథ్య జట్టును కకావికలం చేశారు. 67 పరుగులకే కుప్పకూల్చడంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 112 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మన్‌ జో డెన్లీ(12) మినహా మిగతా ఎవరూ రెండంకెల స్కోర్‌ చేయకపోవడం గమనార్హం. కెప్టెన్‌ జోరూట్‌(0) మరోసారి డకౌట్‌గా వెనుతిరిగి నిరాశ పరిచాడు. 

అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన రెండో ఓవర్‌లో డేవిడ్‌వార్నర్‌(0) ఎల్బీగా డకౌటయ్యాడు. అనంతరం 12వ ఓవర్‌లో మరో ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌(20) జాక్‌లీచ్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. దీంతో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆసీస్‌ రెండు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. ప్రస్తుతం ఉస్మాన్‌ ఖవాజా(11), లబూషేన్‌(4) బ్యాటింగ్‌ చేస్తున్నారు. కాగా ఆసీస్‌ ప్రస్తుతం 152 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.