Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146228
            [news_title_telugu_html] => 

సైనిక సేవ ముగించుకొని రాజకీయాల్లోకి ధోనీ!

[news_title_telugu] => సైనిక సేవ ముగించుకొని రాజకీయాల్లోకి ధోనీ! [news_title_english] => After returning from army duty MS Dhoni dons the politician role [news_short_description] => టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. లెహ్‌లో సైనిక విధులు ముగించుకొని రాగానే రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. కుర్తా పైజామా, ఖద్దరు దుస్తులు ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు.... [news_tags_keywords] => ms dhoni,Team India,politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => 1164100685379411968 [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:45:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
సైనిక సేవ ముగించుకొని రాజకీయాల్లోకి ధోనీ! - After returning from army duty MS Dhoni dons the politician role - EENADU
close

తాజా వార్తలు

సైనిక సేవ ముగించుకొని రాజకీయాల్లోకి ధోనీ!

రాజకీయ నేతగా చిత్రాలు వైరల్‌

ముంబయి: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ కొత్త అవతారం ఎత్తాడు. లెహ్‌లో సైనిక విధులు ముగించుకొని రాగానే రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. కుర్తా పైజామా, ఖద్దరు దుస్తులు ధరించి రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేశాడు. దీంతో క్రికెట్‌కు వీడ్కోలు పలికి మహీ ప్రత్యక్ష రాజకీయాల్లో అడుగుపెట్టనున్నాడా? అన్న కథనాలు మొదలయ్యాయి. రాజకీయ నాయకుడిగా ఉన్న ధోనీ చిత్రాలను అభిమానులు సోషల్‌ మీడియాలో విపరీతంగా పంచుకోవడంతో అవి వైరల్‌గా మారిపోయాయి. ఇంతకీ టీమిండియా మాజీ నాయకుడు నిజమైన రాజకీయ నాయకుడిగా మారుతున్నాడా?

వెస్టిండీస్‌ సిరీస్‌కు ముందు మహీ కెరీర్‌పై విపరీతంగా చర్చ జరిగింది. జట్టులో అతడి స్థానం ఏంటో, పాత్ర ఏంటో నిర్వచించాలని మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు అన్నారు. ఐతే లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ అయిన మహీ రెండు నెలలు సైన్యంలో చేరి దేశసేవ చేస్తానని ప్రకటించాడు. విండీస్‌ సిరీస్‌కు తనకు తానే దూరమయ్యాడు. ఈ క్రమంలోనే 15 రోజులు లెహ్‌లో విధులు నిర్వర్తించాడు. విరామం తీసుకొని ఇంటికి తిరిగి రాగానే ఇదిగో... ఇలా రాజకీయ నాయకుడి చిత్రాలు దర్శనమిచ్చాయి. అసలు ఇంతకీ ఏం జరగిందంటే?

ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం ధోనీ ముంబయి వెళ్లాడు. అక్కడ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అందులో ఒక హోర్డింగ్‌పై మహీ రాజకీయ నాయకుడిగా కనిపించాడు. క్రేజీగా భావించిన అభిమానులు వెంటనే సోషల్‌ మీడియాలో వాటిని షేర్‌ చేసుకోవడం ప్రారంభించారు. దాంతో ఆ చిత్రాలు వైరల్‌గా మారిపోయాయి. పనిలో పనిగా కొందరు ‘సైనిక సేవ ముగిసింది. ప్రజాసేవ మొదలైంది’, ‘రాజకీయ రణక్షేత్రంలోకి ధోనీ అడుగుపెట్టాల్సిన తరుణం వచ్చేసింది’ అంటూ చమత్కరించారు. అదన్నమాట సంగతి!!

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.