Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146242
            [news_title_telugu_html] => 

కోచ్‌ ఇంటర్వ్యూలో బంగర్‌ ఉక్కిరి బిక్కిరి!

[news_title_telugu] => కోచ్‌ ఇంటర్వ్యూలో బంగర్‌ ఉక్కిరి బిక్కిరి! [news_title_english] => No appropriate replies by Sanjay Bangar grilled for over an hour in interview [news_short_description] => టీమిండియా ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ముఖాముఖి ముగిసింది. చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ ఆయన్ను గంటకు పైగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిందని సమాచారం. వారి ప్రశ్నలకు ఆయన సరైన ........... [news_tags_keywords] => Sanjay Bangar,Team India,batting caoch,msk prasad,worldcup [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 00:45:07 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కోచ్‌ ఇంటర్వ్యూలో బంగర్‌ ఉక్కిరి బిక్కిరి! - No appropriate replies by Sanjay Bangar grilled for over an hour in interview - EENADU
close

తాజా వార్తలు

కోచ్‌ ఇంటర్వ్యూలో బంగర్‌ ఉక్కిరి బిక్కిరి!

ముంబయి: టీమిండియా ప్రస్తుత బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ ముఖాముఖి ముగిసింది. చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలోని కమిటీ ఆయన్ను గంటకు పైగా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిందని సమాచారం. వారి ప్రశ్నలకు ఆయన సరైన సమాధానాలు సైతం ఇవ్వలేకపోయారని తెలుస్తోంది. భారత జట్టు కోచింగ్‌ సిబ్బంది పదవీ కాలం ముగియడంతో కొత్త వారికోసం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ వారం క్రితమే రవిశాస్త్రిని తిరిగి ప్రధాన కోచ్‌గా ఎంపిక చేసింది. సహాయ సిబ్బందిని ఎంపిక చేసే బాధ్యతను మాత్రం సెలక్షన్‌ కమిటీకి బీసీసీఐ అప్పగించింది. ఇప్పటి వరకు దాదాపు 60 మందిని ఈ కమిటీ ఇంటర్వ్యూ చేయగా అందులో సంజయ్‌ బంగర్‌ ఒకరు. జులైలో జరిగిన ప్రపంచకప్‌ సెమీఫైనల్లో జట్టు వైఫల్యం గురించి కమిటీ ఆయన్ను ప్రశ్నించిందట. రెండేళ్ల సమయం ఉన్నప్పటికీ స్థిరమైన బ్యాటింగ్‌ లైనప్‌ను ఎందుకు రూపొందించలేదని అడిగింది.

నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేసే ఆటగాడిని గుర్తించలేకపోవడం, సెమీస్‌లో ధోనీని ఏడో స్థానంలో పంపడంపై కమిటీ గుచ్చిగుచ్చి ప్రశ్నించడంతో బంగర్‌ ఉక్కిరి బిక్కిరి అయ్యారని తెలుస్తోంది. అంతే కాకుండా గతేడాది కేప్‌టౌన్‌లో 208 పరుగుల లక్ష్య ఛేదనలో జట్టు ఎందుకు విఫలమైంది, 72 పరుగుల తేడాతో ఎలా ఓడిందని ప్రశ్నించారట. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 31 పరుగుల తేడాతో ఓడిన టెస్టులో ఛెతేశ్వర్‌ పుజారాను తప్పించేందుకు కారణాలేంటో అడిగింది. మొత్తంగా ప్రపంచకప్‌ వైఫల్యమే ఎక్కువ సమయం తీసుకుందని, బంగర్‌ సరైన సమాధానాలు ఇవ్వలేదని సంబంధిత వర్గాల నుంచి అందిన సమాచారం.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.