Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146464
            [news_title_telugu_html] => 

పోరాడిన రహానె

[news_title_telugu] => పోరాడిన రహానె [news_title_english] => due to rain match stopped early [news_short_description] => టీ20, వన్డే సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియాకు టెస్టు సిరీస్‌లో తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించారు. భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్య.. [news_tags_keywords] => ind vs wi,kohli,rahane,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 03:00:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పోరాడిన రహానె - due to rain match stopped early - EENADU
close

తాజా వార్తలు

పోరాడిన రహానె

తొలి రోజు ఆటకు వరుణుడి అడ్డంకి
ఆకట్టుకున్న కేఎల్‌ రాహుల్‌, విహారి
68.5 ఓవర్లలో భారత్‌ 203/6
వెస్టిండీస్‌తో తొలి టెస్టు 
అంటిగ్వా

టీ20, వన్డే సిరీస్‌లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియాకు టెస్టు సిరీస్‌లో తొలి రోజు గట్టి సవాలే ఎదురైంది. విండీస్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌పై ఆధిపత్యం సాధించారు. భారత వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(81; 163బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్‌ ఆడగా.. ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌(44; 97బంతుల్లో 5×4) రాణించడంతో భారత్‌ మొదటి రోజు ఆరు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. అనుకున్నట్లుగానే వరుణుడు ఈ మ్యాచ్‌కు కూడా ఆటంకం కలిగించాడు. ఫలితంగా తొలి రోజు ఆట 68.5 ఓవర్ల వద్దే ముగిసింది. 

వరుణుడు ప్చ్‌.. 

టెస్టు సిరీస్‌ ఆరంభంలోనే వరుణుడు పలకరించాడు. వర్షం కారణంగా టాస్‌ ఆలస్యమైంది. మ్యాచ్‌ జరుగుతుండగా కూడా వరుణుడు రెండు సార్లు అంతరాయం కలిగించాడు. ముందుగా 47.2 ఓవర్‌లో తేలికపాటి జల్లులు కురిశాయి. దీంతో అంపైర్లు తాత్కాలిక విరామం ప్రకటించారు. మళ్లీ 68.5 ఓవర్‌లో జల్లులు కురవడంతో ఆటను కాసేపు నిలిపేశారు. కాసేపటికే వర్షం నిలిచినా.. వాతావరణం సహకరించడం లేదని మరో సెషన్‌ మిగిలి ఉండగానే ముందుగానే తొలి రోజు ఆటను నిలిపేశారు. 

టాప్‌ ఆర్డర్‌ తడబడినా..
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. విండీస్‌ ఫాస్ట్‌బౌలర్లు రోచ్‌, గాబ్రియెల్‌ ధాటికి 25 పరుగులకే మూడు వికెట్లు చేజార్చుకుంది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన మయాంక్‌ (5) ఐదో ఓవర్లో రోచ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అతడు ఔట్‌సైడ్‌ ఎడ్జ్‌తో వికెట్‌కీపర్‌ హోప్‌ చేతికి చిక్కాడు. మొదట అంపైర్‌ ఔట్‌ ఇవ్వకున్నా.. విండీస్‌ సమీక్ష కోరి విజయవంతమైంది. అదే ఓవర్లో పుజారాను కూడా ఔట్‌ చేయడం ద్వారా భారత్‌ను రోచ్‌ గట్టి దెబ్బతీశాడు. అప్పటికి స్కోరు 7 పరుగులే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కెప్టెన్‌ కోహ్లీ కూడా నిలవలేకపోయాడు. బాగానే ఆరంభించినా.. గాబ్రియెల్‌ బౌలింగ్‌లో గల్లీలో బ్రూక్స్‌కు చిక్కాడు. 

కేఎల్‌తో కలిసి..
అప్పుడు క్రీజులోకి వచ్చిన రహానె పట్టుదలతో ఆడుతూ వచ్చాడు. రాహుల్‌తో ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ నిలబెడుతూ వచ్చాడు. మరో వికెట్‌ పడకుండా లంచ్‌ సమయానికి భారత్‌ 68/3తో నిలిచింది. ఆ తర్వాత రాహుల్‌, రహానె ఇద్దరూ అదే పోరాటం కొనసాగించడంతో భారత్‌ ఓ దశలో 93/3తో నిలిచింది. అయితే ఇన్నింగ్స్‌ సాఫీగా సాగుతుండగా చేజ్‌ బౌలింగ్‌లో రాహుల్‌ ఔట్‌ కావడంతో 68 పరుగుల నాలుగో వికెట్‌ భాగస్వామ్యానికి తెరపడింది. 

విహారితో విలువైన భాగస్వామ్యం..
రాహుల్ ఔట్‌ అయ్యాక కూడా రహానె చక్కని బ్యాటింగ్‌ను కొనసాగించాడు. విహారితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపిస్తూ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. కాసేపు వరుణుడు ఆటంకం కలిగించినా టీ విరామం తర్వాత మళ్లీ క్రీజులోకి వచ్చిన ఈ జోడీ విండీస్‌ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ముందుకు సాగింది. విహారి కూడా ఆకట్టుకునే బ్యాటింగ్‌ చేశాడు. కానీ 55వ ఓవర్‌లో రోచ్‌ బౌలింగ్‌లో అతను వికెట్‌కీపర్‌ షై హోప్‌ చేతికి చిక్కాడు. దీంతో 82 పరుగులు భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. కాసేపటికే రహానె కూడా 189 పరుగుల వద్ద గాబ్రియెల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. పంత్‌ (20), జడేజా(3) మరో వికెట్‌ పడకుండా ఇన్నింగ్స్‌ సాగిస్తున్న దశలో వరుణుడు మళ్లీ ఆటంకం కలిగించాడు. ఫలితంగా అంపైర్లు తొలి రోజు ఆటను ముందుగానే నిలిపివేశారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.