Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146724
            [news_title_telugu_html] => షార్ట్‌లిస్ట్‌ అవ్వని జాంటీ రోడ్స్‌.. కారణమిదే!
            [news_title_telugu] => షార్ట్‌లిస్ట్‌ అవ్వని జాంటీ రోడ్స్‌.. కారణమిదే!
            [news_title_english] => No point shortlisting Jonty if he isnt first choice Prasad makes it clear
            [news_short_description] => టీమిండియాకు ఎంపిక చేసిన సహాయ కోచ్‌ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ షార్ట్‌లిస్ట్‌ అవ్వలేదు. ఆయన తమ తొలి ప్రాధామ్యంలో లేకపోవడమే కారణమని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు.....

            [news_tags_keywords] => MSK Prasad,R Sridhar,Jonty Rhodes,fielding coach
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-23 18:56:40
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
షార్ట్‌లిస్ట్‌ అవ్వని జాంటీ రోడ్స్‌.. కారణమిదే! - No point shortlisting Jonty if he isnt first choice Prasad makes it clear - EENADU
close

తాజా వార్తలు

షార్ట్‌లిస్ట్‌ అవ్వని జాంటీ రోడ్స్‌.. కారణమిదే!

ముంబయి: టీమిండియాకు ఎంపిక చేసిన సహాయ కోచ్‌ల జాబితాలో దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ జాంటీ రోడ్స్‌ షార్ట్‌లిస్ట్‌ అవ్వలేదు. ఆయన తమ తొలి ప్రాధామ్యంలో లేకపోవడమే కారణమని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నారు. ఆ స్థాయి వ్యక్తి భారత్‌-ఏ, అండర్‌-19 ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి సరిపోడని వెల్లడించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఆర్‌.శ్రీధర్‌నే కమిటీ ఫీల్డింగ్‌ కోచ్‌గా తిరిగి నియమించింది. భారత్‌-ఏ, అండర్‌-19 ఫీల్డింగ్‌ కోచ్‌ అభయ్‌ శర్మ రెండు, టి.దిలీప్‌ మూడో స్థానంలో నిలిచారు.

‘జాంటీరోడ్స్‌ స్థాయికి అక్కడ (2, 3 స్థానాల్లో) సరిపోతాడని మాకు అనిపించలేదు. అవి భారత్‌-ఏ, ఎన్‌సీఏకి ఉద్దేశించనవి. ప్రస్తుతం ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డింగ్‌ కోచుల్లో ఆర్‌.శ్రీధర్‌ ఒకరు. దురదృష్టవశాత్తు జట్టులో ముగ్గురు, నలుగురు కీపర్లతో కూర్పు కుదరకపోవడంతో ప్రపంచకప్‌లో ఆయన కోరుకున్న ఫలితం రాలేదేమో! భారత జట్టును ఆయన ఉత్తమ ఫీల్డింగ్‌ బృందంగా మార్చారు. అందుకే శ్రీధర్‌ ఎంపికలో రెండో ఆలోచనే లేదు’ అని ఎమ్మెస్కే తెలిపారు.

అంతర్జాతీయ క్రికెట్‌లో జాంటీరోడ్స్‌ అత్యుత్తమ ఫీల్డరన్న సంగతి తెలిసిందే. గతంలో ముంబయి ఇండియన్స్‌ ఫీల్డింగ్‌ కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. టీమిండియాకు శ్రీధర్‌ను ఎంపిక చేయడంతో రోడ్స్‌ను భారత్‌-ఏ స్థాయికి తీసుకోవడం భావ్యం కాదని సెలక్షన్‌ కమిటీ ఆలోచనగా తెలుస్తోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.