Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000289
            [news_title_telugu_html] => 

108 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

[news_title_telugu] => 108 పరుగుల ఆధిక్యంలో టీమిండియా [news_title_english] => West Indies trail by 108 runs [news_short_description] => వెస్టిండీస్‌తో తొలి టెస్టులో కోహ్లీసేన పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆటలో జడేజా(58; 112 బంతుల్లో 6×4, 1×6) అద్భుత పోరాటం చేశాడు... [news_tags_keywords] => IND VS WI,ishant,kohli,jadeja,cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 03:27:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
108 పరుగుల ఆధిక్యంలో టీమిండియా - West Indies trail by 108 runs - EENADU
close

తాజా వార్తలు

108 పరుగుల ఆధిక్యంలో టీమిండియా

ఐదు వికెట్లు పడగొట్టిన ఇషాంత్‌ శర్మ
టెస్టుల్లో బుమ్రాకి 50వ వికెట్‌
రెండో రోజు ఆటలో విండీస్‌ 59 ఓవర్లకి 189/8

​​​​​​

అంటిగ్వా: వెస్టిండీస్‌తో తొలి టెస్టులో కోహ్లీసేన పట్టుబిగిస్తోంది. రెండో రోజు ఆటలో జడేజా(58; 112 బంతుల్లో 6×4, 1×6) అద్భుత పోరాటం చేశాడు. టెయిలెండర్ల సహాయంతో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పడంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 297 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్‌ను ఇషాంత్‌ శర్మ(5/42) కట్టడి చేశాడు. చేజ్‌(48; 74బంతుల్లో 5×4, 1×6) పట్టుదలతో ఆడి ఆకట్టుకున్నాడు. రెండో రోజు ఆట ముగిసే సరికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 59 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్‌ 108 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.  

మంచి ఆరంభమే దొరికినా..
విండీస్‌ ఇన్నింగ్స్‌ మెరుగ్గానే ఆరంభించినా ఎక్కువసేపు నిలుపుకోలేకపోయింది. బ్రాత్‌వైట్‌తో ఓపెనింగ్‌కు దిగిన క్యాంప్‌బెల్‌(23; 30బంతుల్లో 4×4) చక్కటి షాట్లతో మెరిపించాడు. కానీ ఎనిమిదో ఓవర్‌లో షమి బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. కుదురుకున్నట్లే కనిపించిన బ్రాత్‌వైట్‌(14)ను ఇషాంత్‌ బోల్తా కొట్టించాడు. బ్రూక్స్(11) కూడా జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో రహానె చేతికి చిక్కాడు. అప్పటికి స్కోరు 50 పరుగులు. 

నిలబెట్టిన చేజ్‌..
తక్కువ పరుగులు వ్యవధిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ విండీస్‌ను చేజ్‌ ఆదుకున్నాడు. డారెన్‌ బ్రావో(18)తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దాదు. టీ బ్రేక్‌ సమయానికి విండీస్‌ 82/3తో కాస్త మెరుగ్గానే కనిపించింది. కాసేపటికే బుమ్రా ఈ జోడీని విడదీశాడు. 30వ ఓవర్‌లో మొదటి బంతికే బ్రావోను ఎల్బీగా ఔట్‌ చేశాడు.

* బ్రావోను పెవిలియన్‌కు పంపడం ద్వారా బుమ్రా టెస్టు క్రికెట్‌లో 50 వికెట్ల ఖాతాలో చేరాడు. 11 టెస్టుల్లోనే అతని ఈ రికార్డు అందుకోవడం విశేషం.

* భారత్‌ తరఫున తక్కువ మ్యాచ్‌ల్లో(11).. 50 వికెట్లు పడగొట్టిన ఫాస్ట్‌ బౌలర్‌గా బుమ్రా అగ్రస్థానంలో నిలిచాడు.

* టెస్టుల్లో ఒకే మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టడం ఇషాంత్‌కిది తొమ్మిదోసారి. వెస్టిండీస్‌పై ఇది మూడోసారి. 

తర్వాత షై హోప్‌తో చేజ్‌ గొప్ప పోరాటమే చేశాడు. భారత బౌలర్లను చక్కగా ఎదుర్కొంటూ స్వేచ్ఛగా ఆడే ప్రయత్నం చేశాడు. అర్ధశతకానికి చేరువయ్యే క్రమంలో ఇషాంత్‌ బౌలింగ్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 42 పరుగులు భాగస్వామ్యానికి తెరపడింది. 

ఇషాంత్‌ కట్టడి..
విండీస్‌ తరఫున షై హోప్‌, హెట్‌మైయర్‌ జోడీ మరో విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. చక్కటి సమన్వయంతో చెత్త బంతుల్ని మాత్రమే శిక్షిస్తూ వీరిద్దరూ ఇన్సింగ్స్‌ను గాడిన పెట్టే ప్రయత్నం చేశారు. కానీ లంబూ వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. 
తక్కువ పరుగుల వ్యవధిలో వీరిని కూడా ఔట్‌ చేశాడు. 54వ ఓవర్‌ ఆఖరి బంతికి షై హోప్‌(24; 65బంతుల్లో 1×4), 56వ ఓవర్‌లో మూడో బంతికి హెట్‌మైయర్‌(35; 47బంతుల్లో 3×4), ఆఖరి బంతికి రోచ్‌(0)లను వెంటవెంటనే ఔట్‌ చేసి విండీస్‌ ఆశలపై నీళ్లు చల్లాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి క్రీజులో కెప్టెన్‌ హోల్డర్‌(10), కమిన్స్ ఉన్నారు. 

పోరాడిన జడేజా..

రహానె పోరాటంతో తొలి రోజు ఆట చివరికి భారత్‌ 203/6తో నిలిచింది. రెండో రోజు పంత్‌ (24), జడేజా ఇన్నింగ్స్‌ కొనసాగించగా.. కాసేపటికే పంత్‌ వెనుదిరిగాడు. కానీ విండీస్‌ పదునైన పేస్‌ను ఎదుర్కొంటూ జడేజా పట్టుదలగా నిలిచాడు. ఇషాంత్‌ (19; 62 బంతుల్లో 1×4) కూడా రోచ్‌, గాబ్రియెల్‌లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఇద్దరూ ఎనిమిదో వికెట్‌కు 116 బంతుల్లో 60 పరుగులు జోడించారు. ఇషాంత్‌ను గాబ్రియెల్‌ బౌల్డ్‌ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. షమి డకౌటైనా.. జడేజా ఆఖరి వికెట్‌కు బుమ్రా (4 నాటౌట్‌)తో మరో 29 పరుగులు జోడించి నిష్క్రమించాడు. విండీస్‌ బౌలర్లలో రోచ్‌ నాలుగు వికెట్లు పడగొట్టాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.