close

తాజా వార్తలు

రైలు కింద జారి పడి.. ప్రాణాలతో బయటపడి

రాంచీ: ఝార్ఖండ్‌ రాజధాని రాంచీ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ కదులుతున్న రైలు దిగే క్రమంలో రైలు కింద పడింది. అయితే అదృష్టవశాత్తు ప్రాణాలు దక్కించుకొని స్వల్పగాయాలతో బయటపడింది. కదులుతున్న రైలు నుంచి వ్యతిరేక దిశలో ఆమె దిగేందుకు ప్రయత్నించింది. అనుకోకుండా ఆమె రైలు, ప్లాట్‌ఫాంకు మధ్యలో ఇరుక్కొని రైలుకిందకి జారిపోయింది. ఈ దృశ్యాన్ని చూసి అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆమెకు ఏమై ఉంటుందోనని ఆందోళన చెందారు. అయితే రైలు వెళ్లిపోయిన అనంతరం స్వల్పగాయాలతో పట్టాలపైనుంచి ప్లాట్‌ఫాంపైకి చేరడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.