Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000551
            [news_title_telugu_html] => విరాట్‌కు ‘నిలకడ’ అవసరం
            [news_title_telugu] => విరాట్‌కు ‘నిలకడ’ అవసరం
            [news_title_english] => Virat needs to be a bit more consistent with team election says Sourav Ganguly
            [news_short_description] => టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మరో సూచన చేశాడు. ఆటగాళ్ల ఎంపికపై నిలకడగా ఉండాలని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రోహిత్‌ శర్మకు చోటు...

            [news_tags_keywords] => Sourav Ganguly,virat kohli,ravichandran ashwin,INDvsWI
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 23:57:08
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
విరాట్‌కు ‘నిలకడ’ అవసరం - Virat needs to be a bit more consistent with team election says Sourav Ganguly - EENADU
close

తాజా వార్తలు

విరాట్‌కు ‘నిలకడ’ అవసరం

ముంబయి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ మరో సూచన చేశాడు. ఆటగాళ్ల ఎంపికపై నిలకడగా ఉండాలని పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రవిచంద్రన్ అశ్విన్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, రోహిత్‌ శర్మకు చోటు దక్కకపోవడంపై జరుగుతున్న చర్చపై దాదా స్పందించాడు. గతంలోనూ కోహ్లీ ప్రతి మ్యాచ్‌కు ఆటగాళ్లను మారుస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

‘విరాట్‌ మరికాస్త నిలకడగా ఉండాలి. ఆటగాళ్లను ఎంపిక చేసిన తర్వాత వారు ఆత్మవిశ్వాసం, లయ సాధించేందుకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలి. విండీస్‌పై శ్రేయస్‌ అయ్యర్‌ ఎలా ఆడారో చూశారు కదా. ఎంపిక చేసిన ఆటగాళ్లకు ఎక్కువ స్వేచ్ఛను ఇవ్వాలి. ఎక్కువ మంది క్రికెటర్ల విషయంలో ఇది జరగాలి. విరాట్‌ ఆ పని చేస్తాడని భావిస్తున్నా. కుల్‌దీప్‌ను ఎంపిక చేయకపోవడం ఆశ్చర్యం కలిగించింది. ఆస్ట్రేలియాలో అతనాడిన చివరి టెస్టులో ఐదు వికెట్లు తీశాడు. కానీ జడేజా సైతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఆంటిగ్వాలోని పిచ్‌ ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలిస్తోంది. స్పిన్‌ పరిస్థితి ఏంటో చూడాలి. విండీస్‌పై అశ్విన్‌కు మంచి రికార్డుంది. అయితే ఈ పిచ్‌పై జడ్డూ వికెట్లు ఎలా తీస్తాడో రెండు రోజుల్లో తెలుస్తుంది’ అని దాదా వెల్లడించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.