Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000604
            [news_title_telugu_html] => 

జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది

[news_title_telugu] => జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది [news_title_english] => A part of me is gone Cricketers mourn Jaitleys death [news_short_description] => కేంద్ర మాజీ మంత్రి, భాజపా నాయకుడు అరుణ్‌ జైట్లీ (66) ఇక లేరు. ప్రజా నాయకుడిగానే కాకుండా క్రికెట్‌ పాలకుడిగానూ ఆయన ఖ్యాతి ఆర్జించారు. స్వతహాగా క్రికెట్‌ ప్రేమికుడైన జైట్లీ దిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగానూ పనిచేశారు. విరాట్‌ కోహ్లీ,... [news_tags_keywords] => Arun Jaitley,gautam Gambhir,Virender Sehwag,CK Khanna,akash Chopra [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 17:26:40 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది - A part of me is gone Cricketers mourn Jaitleys death - EENADU
close

తాజా వార్తలు

జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది

ఆయన వల్లే దిల్లీ క్రికెటర్లకు టీమిండియాలో చోటు: వీరూ

దిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, భాజపా నాయకుడు అరుణ్‌ జైట్లీ (66) ఇక లేరు. ప్రజా నాయకుడిగానే కాకుండా క్రికెట్‌ పాలకుడిగానూ ఆయన ఖ్యాతి ఆర్జించారు. స్వతహాగా క్రికెట్‌ ప్రేమికుడైన జైట్లీ దిల్లీ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడిగానూ పనిచేశారు. విరాట్‌ కోహ్లీ, శిఖర్‌ ధావన్‌, ఇషాంత్‌ శర్మ సహా ఎంతో మందిని జాతీయ జట్టుకు ఆడేలా ప్రోత్సహించారు. శనివారం ఆయన కన్నుమూశారని తెలియగానే ఆయనతో అనుబంధం ఉన్న క్రీడాకారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గౌతమ్‌ గంభీర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఆకాశ్‌ చోప్రా తదితరులు జైట్లీ కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.


తండ్రి నీకు మాట్లాడాలని చెప్తారు. తండ్రిలాంటి వారు నిన్ను ప్రసంగించాలని సూచిస్తారు. నాన్న నీకు నడక నేర్పిస్తారు. నాన్నలాంటి వ్యక్తి నీకు పరుగెత్తడం నేర్పిస్తారు. తండ్రి నీకు పేరు పెడతాడు. తండ్రి సమానులు నీకో గుర్తింపునిస్తారు. నా పితృ సమానుడైన అరుణ్‌ జైట్లీ మరణంతో నాలో ఓ భాగం పోయినట్టుంది.

- గౌతమ్‌ గంభీర్‌, మాజీ క్రికెటర్‌


అరుణ్‌ జైట్లీ ఇక లేరని తెలిసి బాధపడ్డా. ఆయన ప్రజా జీవితంలోనే కాకుండా చాలామంది దిల్లీ క్రికెటర్లు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించేలా కీలక పాత్ర పోషించారు. అత్యున్నత స్థాయిలో దిల్లీ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు రాని రోజులు ఉన్నాయి. కానీ డీడీఏసీలో ఆయన నాయకత్వంలో నాతో సహా ఎంతోమందికి అవకాశాలు వచ్చాయి. ఆటగాళ్ల అవసరాలు ఆయన వినేవారు. సమస్యలు పరిష్కరించేవారు. ఆయనతో నాకు వ్యక్తిగతంగా ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం.

- వీరేంద్ర సెహ్వాగ్‌, మాజీ క్రికెటర్‌


మా అనుబంధం శ్రీరాం కామర్స్‌ కళాశాల రోజుల్నుంచి కొనసాగుతోంది. కాలేజీ యూనియన్‌ అధ్యక్షుడిగా జైట్లీ, జనరల్‌ సెక్రటరీగా నేనూ పనిచేశాం. డీడీసీఏ, బీసీసీఐలో సాన్నిహిత్యంగా పనిచేసేందుకు ఆయన నన్ను ఆహ్వానించేవారు. క్రికెట్‌కు ఆయన చేసిన సేవ ఎప్పటికీ గుర్తుంటుంది.

- సీకే ఖన్నా, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు


అరుణ్‌ జైట్లీ కన్నుమూశారని తెలిసి ఎంతో బాధపడ్డాను. విద్వత్తున్న వ్యక్తి. క్రికెట్‌ ప్రేమికులు. ఎప్పుడూ సహాయం చేసేవారు. అండర్‌-19 స్థాయిలో బాగా ఆడుతున్న పిల్లల పేర్లు సైతం ఆయన గుర్తుంచుకొనేవారు. మీరు లేని లోటును ఈ ప్రపంచం పూడ్చలేదు సర్‌.

- ఆకాశ్‌ చోప్రా, మాజీ క్రికెటర్‌


విశిష్టమైన పాలకుడు. మిస్టర్‌ అరుణ్‌ జైట్లీ క్రికెట్‌ను ఎంతో ఇష్టంగా అనుసరించేవారు. అత్యంత గౌరవనీయ క్రికెట్‌ పాలకుడిగా ఆయన చిరస్మరణీయంగా గుర్తుండిపోతారు. డీడీసీఏ అధ్యక్షుడిగా క్రికెట్‌ మౌలిక వసతుల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. క్రికెటర్లకు అత్యంత సన్నిహితుడు. వారికెప్పుడూ అండగా నిలిచేవారు. అత్యుత్తమంగా ఆడేందుకు ప్రోత్సహించేవారు.

- బీసీసీఐ


సంఘం మాజీ అధ్యక్షుడు అరుణ్‌ జైట్లీ మరణానికి డీడీసీఏ సంతాపం ప్రకటిస్తోంది. ఆయన అనుభవం, విజ్ఞానం, అండదడల్ని కోల్పోయామని సభ్యులు బాధపడుతున్నారు.

- దిల్లీ క్రికెట్‌ సంఘం (డీడీసీఏ)


భారత క్రికెట్‌ను నిష్కల్మషంగా ప్రేమించిన వారిలో అరుణ్‌ జైట్లీ ఒకరు. అవసరమైన ప్రతి సారీ బీసీసీఐని కాపాడేందుకు ముందుండేవారు. క్లిష్ట సమయాల్లో ఒక న్యాయవాదిగా ఆయన బోర్డును నడిపించారు.

- అవిషేక్‌ దాల్మియా, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం సంయుక్త కార్యదర్శి


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.