Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000619
            [news_title_telugu_html] => 

కాంస్యంతో సరి:సెమీస్‌లో సాయి ప్రణీత్‌ ఓటమి

[news_title_telugu] => కాంస్యంతో సరి:సెమీస్‌లో సాయి ప్రణీత్‌ ఓటమి [news_title_english] => B sai praneeth game ends in BWF world championship [news_short_description] => బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయి ప్రణీత్‌ ప్రస్థానం ముగిసింది. అతడు కాంస్య పతకానికే పరిమితం అయ్యాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో టాప్‌సీడ్‌ కెంటో మోమోటా (జపాన్‌)తో జరిగిన... [news_tags_keywords] => B sai praneeth,BWF world championship [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 18:48:08 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కాంస్యంతో సరి:సెమీస్‌లో సాయి ప్రణీత్‌ ఓటమి - B sai praneeth game ends in BWF world championship - EENADU
close

తాజా వార్తలు

కాంస్యంతో సరి:సెమీస్‌లో సాయి ప్రణీత్‌ ఓటమి

బాసెల్‌ (స్విట్జర్లాండ్‌): బ్యాడ్మింటన్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు కుర్రాడు భమిడిపాటి సాయి ప్రణీత్‌ ప్రస్థానం ముగిసింది. అతడు కాంస్య పతకానికే పరిమితం అయ్యాడు. పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో టాప్‌సీడ్‌ కెంటో మోమోటా (జపాన్‌)తో జరిగిన పోరులో 13-21, 8-21 తేడాతో ఓటమి చవిచూశాడు. ఐతే పురుషుల విభాగంలో 36 ఏళ్ల తర్వాత పతకం గెలిచిన భారత ఆటగాడిగా అతడు ఘనత సాధించిన సంగతి తెలిసిందే.

తొలిగేమ్‌లో పది పాయింట్ల వరకు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఆ తర్వాత మోమోటా జోరు పెంచాడు. వరుసగా ఐదు పాయింట్లు సాధించి ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ప్రణీత్‌ మరో 3 పాయింట్లు సాధించేలోపు అతడు గేమ్‌ పాయింట్‌కు చేరుకొని 21-13తో గేమ్‌ గెలిచాడు. రెండో గేమ్‌లోనూ ప్రణీత్‌పై బలమైన డిఫెన్స్‌కు పేరుమోసిన మోమోటా ఆధిపత్యం కనబరిచాడు. 2-2 నుంచి 9-2కు దూసుకెళ్లాడు. అతడికి అడ్డుకొనేందుకు తెలుగు కుర్రాడి శక్తి, అనుభవం చాల్లేదు. మోమోటా వరుస పాయింట్లతో 21-8తో రెండో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. పసిడిపోరుకు అర్హత సాధించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.