Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000526
            [news_title_telugu_html] => 

ఒకే మ్యాచ్‌లో 134 పరుగులు..8 వికెట్లు

[news_title_telugu] => ఒకే మ్యాచ్‌లో 134 పరుగులు..8 వికెట్లు [news_title_english] => Krishnappa Gowtham Smashes Unbeaten Century and Takes Eight Wickets [news_short_description] => కన్నడ నాట జరుగుతున్న కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌)లో బళ్లారీ టస్కర్స్‌ తరఫున ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్‌ చరిత్ర సృష్టించాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు శివమొగ్గ లయన్స్‌కు చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో...... [news_tags_keywords] => Krishnappa Gowtham ,KPL,Cricket [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-25 00:16:15 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఒకే మ్యాచ్‌లో 134 పరుగులు..8 వికెట్లు - Krishnappa Gowtham Smashes Unbeaten Century and Takes Eight Wickets - EENADU
close

తాజా వార్తలు

ఒకే మ్యాచ్‌లో 134 పరుగులు..8 వికెట్లు

కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌లో అదరగొట్టిన కృష్ణప్ప గౌతమ్‌

బెంగళూరు: కన్నడ నాట జరుగుతున్న కర్ణాటక ప్రీమియర్‌ లీగ్‌(కేపీఎల్‌)లో బళ్లారి టస్కర్స్‌ తరఫున ఆడుతున్న కృష్ణప్ప గౌతమ్‌ చరిత్ర సృష్టించాడు. బ్యాట్‌తోనూ, బంతితోనూ అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు శివమొగ్గ లయన్స్‌కు చుక్కలు చూపించాడు. 56 బంతుల్లో 134 పరుగులు(నాటౌట్‌) చేసి ఆకట్టుకున్నాడు. ఇందులో 13 సిక్సులు, ఏడు ఫోర్లు ఉండటం విశేషం. ఎడా పెడా బౌండరీలు బాదుతూ కేవలం 39 బంతుల్లో శతకం అందుకున్నాడు.

అంతేనా, బంతితోనూ రఫ్ఫాడించాడు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించాడు. నాలుగు ఓవర్లు ఆడి 15 పరుగులు ఇచ్చి ఎనిమిది వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. టీ 20ల్లో ఇదే రికార్డు ఫలితంగా తన జట్టును 70 పరుగుల తేడాతో గెలిపించి ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు అందుకున్నాడు. ఈ కేపీఎల్‌లో అతి తక్కువ బంతుల్లో శతకం సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. టోర్నమెంట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కూడా ఇదే కావడం విశేషం. ప్రస్తుత కేపీఎల్‌ టోర్నమెంట్‌లో ఒక మ్యాచ్‌ల అత్యధిక సిక్సులు(13) కొట్టిన క్రికెటర్‌ కూడా ఇతడే. ఇలా బౌండరీలు కొట్టే 106 పరుగులు సాధించడం విశేషం. కృష్ణప్ప ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడుతున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.