Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000557
            [news_title_telugu_html] => అహ్హహ్హా..! అహం వదిలేయండి
            [news_title_telugu] => అహ్హహ్హా..! అహం వదిలేయండి
            [news_title_english] => Detox Your Ego Virat Kohlis Choice Of Book Sends Twitter Into A Frenzy
            [news_short_description] => భారత సారథి విరాట్‌ కోహ్లీ ఎక్కడున్నా మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాడు. సెంచరీలు బాదడమో, ఫీల్డింగ్‌ చేస్తూ ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించడమో, వినూత్న హావభావాలతోనో వార్తల్లో ఉంటాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి...

            [news_tags_keywords] => virat kohli,detox your ego,INDvsWI,Book Reading
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => |1164911158307905536|1164916840197287941|1164955108355919872|
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 00:17:13
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
అహ్హహ్హా..! అహం వదిలేయండి - Detox Your Ego Virat Kohlis Choice Of Book Sends Twitter Into A Frenzy - EENADU
close

తాజా వార్తలు

అహ్హహ్హా..! అహం వదిలేయండి

విరాట్‌ కోహ్లీ చదువుతున్న పుస్తకం 

ఆంటిగ్వా: భారత సారథి విరాట్‌ కోహ్లీ ఎక్కడున్నా మీడియా దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటాడు. సెంచరీలు బాదడమో, ఫీల్డింగ్‌ చేస్తూ ప్రత్యర్థులపై దూకుడు ప్రదర్శించడమో, వినూత్న హావభావాలతోనో వార్తల్లో ఉంటాడు. ప్రస్తుతం వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో అతడు ఎక్కువ పరుగులేమీ చేయలేదు. కేవలం 9 పరుగులు చేసి గ్యాబ్రియెల్‌ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరాడు. అయినప్పటికీ ట్విటర్లో మాత్రం హాట్‌ టాపిక్‌గా మారాడు. ఎలాగంటారా?

టీమిండియా బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో విరాట్‌ ఓ పుస్తకం చదువుతూ కూర్చుకున్నాడు. అది స్టీవెన్‌ సిల్వెస్టర్‌ రాసిన ‘డిటాక్స్‌ యువర్‌ ఇగో: సెవెన్‌ ఈజీ స్టెప్స్‌ టు ఎచీవింగ్‌ ఫ్రీడమ్‌, హ్యాపీనెస్‌ అండ్‌ సక్సెస్‌ ఇన్‌ యువర్‌ లైఫ్‌’. తెలుగులో చెప్పాలంటే ‘అహం తగ్గించుకోండి: జీవితంలో స్వేచ్ఛ, ఆనందం, విజయం సాధించేందుకు తేలికైన ఏడు మెట్లు’. సాధారణంగా కోహ్లీ అంటేనే ఆవేశానికి, అహానికి చిహ్నంలా ఉంటాడని కొందరి భావన! అలాంటిది అతడే ఈ పుస్తకం పఠిస్తుండటంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ట్విటర్లో వ్యంగ్య బాణాలు విసురుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు. గతంలోనూ చాలామంది క్రికెటర్లు ఈ పుస్తకం చదివారు. మరి కింగ్‌ కోహ్లీ ఎందుకోసం చదువుతున్నాడో ఏమో!





Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.