Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001534
            [news_title_telugu_html] => 

అండగా నిలిచిన వారికే 100 అంకితం: రహానె

[news_title_telugu] => అండగా నిలిచిన వారికే 100 అంకితం: రహానె [news_title_english] => Dedicated to people who backed me through times syas Rahane [news_short_description] => టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె శతకం బాది దాదాపు రెండేళ్లైంది. ఫామ్‌ కోల్పోయిన అతడు తిరిగి జోరందుకొనేందుకు ఎంతో కష్టపడ్డాడు. వెస్టిండీస్‌పై తొలి టెస్టులో (81; 102) కీలక ఇన్నింగ్సులు ఆడాడు. జట్టు విజయంలో... [news_tags_keywords] => Ajinkya Rahane,INDvsWI,cricket,virat kohli,KL Rahul [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-26 13:11:06 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అండగా నిలిచిన వారికే 100 అంకితం: రహానె - Dedicated to people who backed me through times syas Rahane - EENADU
close

తాజా వార్తలు

అండగా నిలిచిన వారికే 100 అంకితం: రహానె

ఆంటిగ్వా: టీమిండియా టెస్టు జట్టు వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె శతకం బాది దాదాపు రెండేళ్లైంది. ఫామ్‌ కోల్పోయిన అతడు తిరిగి జోరందుకొనేందుకు ఎంతో కష్టపడ్డాడు. వెస్టిండీస్‌పై తొలి టెస్టులో (81; 102) కీలక ఇన్నింగ్సులు ఆడాడు. జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. తనకు కష్టకాలంలో అండగా ఉన్న అందరికీ శతకాన్ని అంకితం ఇస్తున్నానని జింక్స్‌ ప్రకటించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా 318 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

‘ఈ శతకం ఎంతో ప్రత్యేకం. నేను ఫామ్‌ కోల్పోయి గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్న రోజుల్లో నాకు అండగా నిలిచిన అందరికీ దీనిని అంకితం ఇస్తున్నాను. కౌంటీల్లో ఆడటం నాకు మేలు చేసింది. దాదాపు 29, 30 ఇన్నింగ్స్‌ల తర్వాత సెంచరీ చేశాను. ఎప్పుడూ 70ల వద్దే ఆగిపోతున్నాను. కానీ శతకం చేయడం నాకెంతో ప్రత్యేకం. 20 పరుగులకే 3 వికెట్లు చేజార్చుకోవడంతో తొలి ఇన్నింగ్స్‌ క్లిష్టంగా మారింది. మాకో భాగస్వామ్యం కావాలి. రాహుల్‌తో నా భాగస్వామ్యం ఎంతో కీలకం. తొలి రోజు వికెట్‌ తడిగా అనిపించింది. పరుగుల గురించి ఆలోచించకుండా ఎక్కువ బంతులు ఆడటం ముఖ్యమని భావించాం. 90-100 ఓవర్లు ఆడితే పరుగులు వాటంతట అవే వస్తాయని అనుకున్నాం. రెండో ఇన్నింగ్స్‌లో నేను, విరాట్‌ మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని అనుకున్నాం. ఎక్కువ సేపు బ్యాటింగ్‌ చేయాలని కోరుకున్నాం’ అని రహానె అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.