
తాజా వార్తలు
రవీంద్ర జడేజాపై దాదా ప్రశంసలు
ముంబయి: టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చాలినన్ని అవకాశాలు రాకున్నా ఆత్మవిశ్వాసం పోగొట్టుకోలేదని మాజీ సారథి సౌరవ్ గంగూలీ అన్నాడు. ప్రపంచకప్ సెమీఫైనల్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన జడ్డూ తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ జట్టుకు అవసరమైన పరుగులు చేశాడని వెల్లడించాడు. అతడి ఆటలో పోరాట స్ఫూర్తి కనిపిస్తోందని పేర్కొన్నాడు. అజింక్య రహానె భారీ స్కోర్లు సాధించడం బాగుందన్నాడు. టీమిండియాకు సుదీర్ఘ కాలం సేవలందిస్తానని అతడు నిరూపించుకున్నాడని దాదా ప్రశంసించాడు. విండీస్‌తో తొలి పోరులో అతడు శతకం బాదిన సంగతి తెలిసిందే.
‘తొలి టెస్టులో భారీ విజయం సాధించిన భారత్ టెస్టు సిరీస్ క్లీన్‌స్వీప్‌కు సిద్ధమైంది. అన్ని విభాగాల్లోనూ అదరగొడుతోంది. టీమిండియా పేసర్ల బౌలింగ్ చూస్తుంటే గర్వంగా ఉంది. కొన్నాళ్లుగా జట్టుకు జస్ప్రీత్ బుమ్రా ప్రధాన పేసర్‌గా ఉంటున్నాడు. మహ్మద్ షమి, ఇషాంత్ సైతం అదరగొడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్‌లు సరిచేసుకోవడంలో ఇషాంత్ ఎంతో మెరుగయ్యాడు. పాత బంతితో వైవిధ్యం చూపిస్తున్నాడు. మరింత ప్రభావశీలిగా మారాడు’ అని గంగూలీ అన్నాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- మంత్రివర్గంలో వారికి చోటిస్తాం: యడియూరప్ప
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
- కోహ్లీ×విలియమ్స్: గెలుపెవరిదో చూడాలి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
