close

తాజా వార్తలు

ఇక రోహిత్‌కు దారివ్వండి: గంగూలీ

ముంబయి: వెస్టిండీస్‌ పర్యటనను టీమిండియా విజయవంతంగా ముగించింది. టీ20, వన్డే, టెస్టు సిరీస్‌లను క్లీన్‌స్వీప్‌ చేసింది. అజింక్య రహానె ఫామ్‌లోకి వచ్చాడు. హనుమ విహారి అద్భుతంగా ఆడాడు. ఇక బౌలింగ్‌ విభాగం గురించి చెప్పాల్సిన పనేలేదు. ఐతే టాప్‌ ఆర్డర్‌ మాత్రం అంచనాలు అందుకోలేదు. మయాంక్‌ ఫర్వాలేదనిపించినా కేఎల్‌ రాహుల్‌ మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. అతడి స్థానంలో రోహిత్‌ శర్మకు జట్టులో స్థానం ఇవ్వాలని టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ సూచించాడు.

‘ప్రపంచకప్‌ తర్వాత జరిగిన విండీస్‌ పర్యటనలో భారత్‌ అదరగొట్టింది. కొద్దిమంది ఆటగాళ్లు మాత్రం రాణించలేదు. ఓపెనింగ్‌ జోడీపై ఇంకా కసరత్తు జరగాలి. మయాంక్‌ ఫర్వాలేదనిపించాడు. అతడికి మరికొన్ని అవకాశాలు ఇవ్వాలి. అతడి భాగస్వామి కేఎల్‌ రాహుల్‌ మాత్రం తేలిపోయాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ శర్మ ఓపెనర్‌గా ప్రయత్నించాలని ఇంతకుముందే చెప్పాను. అతనికి అవకాశం ఇవ్వాలని నేనిప్పటికీ నమ్ముతున్నా. అతనో అద్భుతమైన ఆటగాడు. అలా బెంచీపై ఉండటానికి వీల్లేదు. ప్రపంచకప్‌లో అద్వితీయ బ్యాటింగ్‌ తర్వాత అతడు టెస్టుల్లో స్థానం దక్కుతుందని ఆశించాడు. మిడిలార్డర్‌లో అజింక్య రహానె, హనుమ విహారి స్థిరపడటంతో అక్కడ వేరేవారికి అవకాశం లేదు. టీమిండియా బౌలింగ్‌ విభాగం సిరీస్‌లో అదరగొట్టింది. జస్ప్రీత్‌ బుమ్రా గాయాల బారిన పడకుండా సహాయ సిబ్బంది పర్యవేక్షించాలి. ఇషాంత్‌, షమి అతడికి చక్కని సహకారం అందించాడు. భువి, ఉమేశ్‌, నవదీప్‌ సైనితో పేస్‌బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది’ అని గంగూలీ అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.