close

తాజా వార్తలు

ఈసీఎఫ్‌బీపై ఆర్‌బీఐ ఆంక్షలు..

ముంబయి: ఈక్యూటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. సరికొత్త బ్రాంచ్‌లను ప్రారంభించవద్దని ఆదేశించింది. షేర్లను లిస్టంగ్‌ చేయడానికి విధించిన గడువు తేదీని అందుకోలేకపోవడంతో ఈ నిబంధనలను విధించింది. దీంతోపాటు ఆ బ్యాంకు సీఈవో వేతనాన్ని నిలిపివేసింది. ఈ బ్యాంకుకు 2016లో ఆర్‌బీఐ నుంచి తుది లైసెన్స్‌ లభించింది. అప్పట్లో ఈ బ్యాంకు మూడేళ్లలో లిస్టవ్వాలని నిబంధన విధించింది. దీంతోపాటు బ్యాంకు అప్పట్లోపు రూ.500 కోట్ల విలువను సాధించాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఆర్‌బీఐ బ్యాంకు సీఈవోకు లేఖ కూడా రాసింది. 
ఈ బ్యాంకు షేర్లను లిస్టంగ్‌ చేయడంలో పురోగతి సాధించకపోతే భవిష్యత్తులో మరిన్ని ఆంక్షలు విధించే అవకాశం ఉందని ఆర్‌బీఐ హెచ్చిరికలు జారీ చేసింది. మరోపక్క ఇప్పటికే దీనిని నుంచి  కొంత సమయం ఇవ్వాలని ఈఎస్‌ఎఫ్‌బీ ఆర్‌బీఐని కోరింది. కానీ, ఆర్‌బీఐ ఈ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.