Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009714
            [news_title_telugu_html] => 

పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు..

[news_title_telugu] => పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు.. [news_title_english] => PV Sindhu recommended for Padma Bhushan [news_short_description] => బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌, తెలుగుతేజం పీవీ సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశముంది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం సింధు పేరును క్రీడాశాఖ [news_tags_keywords] => Sindhu,Badminton,Mary Kom,Boxer,Padma Awards [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 10:43:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు.. - PV Sindhu recommended for Padma Bhushan - EENADU
close

తాజా వార్తలు

పద్మభూషణ్‌కు పీవీ సింధు పేరు..

తొలిసారి పూర్తి మహిళ జాబితాను పంపిన క్రీడాశాఖ

దిల్లీ: బ్యాడ్మింటన్‌లో ప్రపంచ ఛాంపియన్‌, తెలుగుతేజం పీవీ సింధు ఖాతాలో మరో అత్యున్నత అవార్డు చేరే అవకాశముంది. దేశంలోని మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌ కోసం సింధు పేరును క్రీడాశాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో సింధు స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 

పద్మవిభూషణ్‌కు మేరీకోమ్‌..

ఇక రెండో అత్యున్నత పురస్కారమైన పద్మవిభూషణ్‌ కోసం ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ బాక్సర్‌ మేరీ కోమ్‌ పేరును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. పద్మ పురస్కారాలు-2020 కోసం అర్హులైన వారి జాబితాను క్రీడాశాఖ ఇటీవల అవార్డుల కమిటీకి పంపింది. తొలిసారిగా మొత్తం మహిళా క్రీడాకారులతో ఈ జాబితాను తయారుచేసినట్లు సమాచారం. సింధు, మేరీకోమ్‌లతో పాటు మరో ఏడుగురు మహిళా అథ్లెట్ల పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. 

ప్రముఖ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌, టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ మనికా బత్రా, క్రికెటర్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, హాకీ కెప్టెన్‌ రాణి రాంఫాల్‌, మాజీ షూటర్‌ సుమ శిరూర్‌, పర్వతారోహకులు తాషి, నుంగ్షీ మాలిక్‌ పేర్లను పద్మశ్రీ పురస్కారాలకు ప్రతిపాదించినట్లు సదరు మీడియా కథనాలు పేర్కొన్నాయి. వచ్చే ఏడాది గణతంత్ర వేడుకల సందర్భంగా పద్మ పురస్కారాల గ్రహీతల పేర్లను ప్రభుత్వం ప్రకటించనుంది. 

కాగా.. పద్మభూషణ్‌ అవార్డు కోసం పీవీ సింధు పేరును క్రీడాశాఖ గతంలోనూ ప్రతిపాదించింది. 2017లో ఆమె పేరును క్రీడాశాఖ పంపించగా.. అవార్డుల కమిటీ ఎంపిక చేయలేదు. అయితే ఇటీవల సింధు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ను గెలవడంతో ఈసారి పద్మభూషణ్‌ పురస్కారం దాదాపు ఖాయమైనట్లే కన్పిస్తోంది. 

ఇప్పటికే 2015లో కేంద్ర ప్రభుత్వం సింధును పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఇక ప్రముఖ బాక్సర్‌ మేరీకోమ్‌ను 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్‌ అవార్డులు వరించాయి. ఈసారి ఆమెకు పద్మవిభూషణ్‌ పురస్కారం ఇస్తే.. ఈ ఘనత సాధించిన నాలుగో క్రీడాకారిణిగా మేరికోమ్‌ నిలుస్తారు. ఇప్పటివరకు చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌(2007), క్రికెట్‌ లెజండ్‌ సచిన్‌ తెందుల్కర్‌(2008), దివంగత పర్వతారోహకులు సర్‌ ఎడ్మండ్‌ హిల్లరీ ఈ పురస్కారం అందుకున్నారు. 
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.