Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009829
            [news_title_telugu_html] => 

ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో ధోనీకి తెలుసు

[news_title_telugu] => ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో ధోనీకి తెలుసు [news_title_english] => Dhoni has nothing left to achieve says chess wizard Anand [news_short_description] => టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌లో అన్నీ సాధించేశాడని చదరంగ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు. అతడు పోటీపడుతూ ఇంకా పరుగెత్తి సాధించాల్సినవి ఏవీ లేవని వెల్లడించాడు. ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత ధోనీ క్రికెట్‌కు.... [news_tags_keywords] => ms dhoni,Viswanathan Anand,ICC World Cup [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-13 00:20:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో ధోనీకి తెలుసు - Dhoni has nothing left to achieve says chess wizard Anand - EENADU
close

తాజా వార్తలు

ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో ధోనీకి తెలుసు

చెన్నై: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ క్రికెట్‌లో అన్నీ సాధించేశాడని చదరంగ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ అన్నాడు. అతడు పోటీపడుతూ ఇంకా పరుగెత్తి సాధించాల్సినవి ఏవీ లేవని వెల్లడించాడు. ప్రపంచకప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత ధోనీ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతాడని వార్తలు వచ్చాయి. అయితే రిటైర్మెంట్‌పై అతడెలాంటి ప్రకటనలు చేయకపోవడంతో మహీ భవిష్యత్తు ప్రణాళికలు ఏంటన్న సందేహం కలిగింది.

వెస్టిండీస్‌ పర్యటన సందర్భంగానూ ధోనీపై ఇలాంటి ఊహాగానాలు వచ్చాయి. అతడిని ఎంపిక చేస్తారా లేదా అని అందరూ ఆత్రుతగా ఎదురుచూశారు. ధోనీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో తెలుసుకోవాలని మాజీ క్రికెటర్లు సెలక్టర్లకు సూచించారు. చివరికి అతడే సైన్యంలో సేవ చేస్తానని రెండు నెలలు జట్టుకు దూరమయ్యాడు. కాగా ఎప్పుడు వీడ్కోలు పలకాలో ధోనీకి బాగా తెలుసని ఆనంద్‌ అంటున్నాడు. ‘సరైన నిర్ణయమేంటో మహీకి తెలుసు. అయితే అతడు సాధించడానికి క్రికెట్‌లో ఇంకా ఏమీ లేవు. ధోనీ సారథిగా రెండు ప్రపంచకప్‌లు (2007 టీ20 ప్రపంచకప్‌, 2011లో వన్డే ప్రపంచకప్‌) అందించాడు. అతడో అద్భుతమైన నాయకుడు. ఎప్పుడు రిటైర్‌ అవ్వాలో అతడి కన్నా బాగా ఇంకెవ్వరికీ తెలియదు. ఏం చేయాలో అతడికి బాగా తెలుసు. అతడిది అద్భుతమైన కెరీర్‌’ అని ఆనంద్‌ అన్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.