
తాజా వార్తలు
విరాట్‌కోహ్లీపై కపిల్‌దేవ్ ప్రశంసలు
దిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ నెలకొల్పిన ప్రమాణాలకు చేరువగా ఇతర ఆటగాళ్లెవరూ వస్తారనుకోలేదని మాజీ సారథి కపిల్‌దేవ్ అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..‘కోహ్లీ ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. కెరీర్ మధ్యలో అతడి గురించి మాట్లాడటం సరికాదు. అయితే కోహ్లీ సేవలు అసమానమైనవి. క్రికెట్ లెజెండ్ సచిన్ ఆటతీరుకు చేరువగా ఎవరూ వస్తారనుకోలేదు. అయితే కోహ్లీ తన ఆటతో క్రికెట్‌ను మరోస్థాయికి తీసుకెళ్లాడు’ అని పేర్కొన్నాడు. కోట్లా మైదానంలోని ఒక స్టాండ్‌కు విరాట్ కోహ్లీ పేరును డీడీసీఎ ఖరారు చేసిన నేపథ్యంలో కపిల్ ఈ విధంగా మాట్లాడారని తెలుస్తోంది.
అలాగే దిల్లీ ఫిరోజ్‌షా కోట్లా మైదానానికి కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పేరు పెట్టడంపై స్పందించిన కపిల్.. దిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా జైట్లీ క్రికెట్‌కు ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. జైట్లీ గుర్తింపునకు ఇది మాత్రమే సరిపోదని వ్యాఖ్యానించారు. కోట్లా మైదానానికి జైట్లీ పేరు పెట్టడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఈ సందర్భంగా దిల్లీ క్రికెట్ అసోసియేషన్‌కు మాజీ సారథి ధన్యవాదాలు తెలిపాడు. మాజీ క్రికెటర్ నిఖిల్ చోప్రా మాట్లాడుతూ.. జైట్లీ మనస్పూర్తిగా క్రికెట్‌ను ప్రోత్సహించారని, ఆయనకు వీలుచిక్కినప్పుడల్లా మైదానానికి వచ్చి రంజీ క్రికెట్ చూసేవారని గుర్తుచేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- ఫ్యాన్ మృతిపట్ల చెర్రీ ఆవేదన..వీడియో వైరల్
- రేషన్ జాబితా నుంచి వారిని తొలగించొద్దు
- నాగేశ్వరరావు న్యాయం చేయలేడన్నారు!
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- వాహనాల విక్రయాలు.. మళ్లీ తగ్గాయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
