close

తాజా వార్తలు

హెచ్‌ఐవీ ఉందని ఒప్పుకొన్న క్రీడాకారుడు

ఇంటర్నెట్‌డెస్క్‌: తనకు హెచ్‌ఐవీ ఉందని వేల్స్‌కు చెందిన రగ్బీ జట్టు మాజీ కెప్టెన్‌ గారెత్‌ థామస్‌ ప్రకటించాడు. చాలా ఏళ్ల పాటు ఈ విషయాన్ని తనలోనే దాగి ఉంచుకున్నానని తెలిపాడు. 45 ఏళ్ల థామస్‌ 1995 నుంచి 2007 వరకు వేల్స్‌ రగ్బీ జట్టు తరఫున 100కు పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ విషయంపై తనకు బెదిరింపు మెయిల్స్‌ వస్తున్నాయని, అందుకే తానే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తున్నానని పేర్కొన్నాడు. ట్విటర్‌లో పోస్టు చేసిన వీడియోలో అతడు మాట్లాడుతూ ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. హెచ్‌ఐవీ ఉన్నందున తనను సామాజిక బహిష్కరణకు గురిచేయొద్దని, ఈ సందర్భంగా అండగా నిలవాలని కోరాడు. 

తనకు సోకిన వ్యాధి పట్ల నిరంతరం పోరాటం చేస్తానని, హెచ్‌ఐవీపై అవగాహన సదస్సులు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తెస్తానని థామస్‌ వివరించాడు. ప్రజలు తన గురించి ఏమనుకుంటారోననే ఇన్నేళ్లు ఈ రహస్యాన్ని బయటపెట్టలేదని, కొన్నిసార్లు ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వచ్చాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ఇదిలా ఉండగా వేల్స్‌ జట్టు మరోవారంలో తొలిసారి రగ్బీ ప్రపంచకప్‌లో ఆడే సమయంలో థామస్‌ ఈ విషయాన్ని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు అతడు పోస్టు చేసిన వీడియోకి పలువురు నుంచి ప్రశంసలతో పాటు అభినందనలు అందుతుండటం విశేషం. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.