close

తాజా వార్తలు

భారత్‌, పాక్‌ ప్రధానులను కలుస్తా: ట్రంప్‌

వాషింగ్టన్‌: భారత ప్రధాని నరేంద్ర మోదీని త్వరలో కలవనున్నానని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. అలాగే పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో కూడా భేటీ అవుతానన్నారు. శ్వేతసౌధంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించకుండానే భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతల తగ్గుదల విషయంలో పురోగతి జరిగిందని వ్యాఖ్యానించారు.

హ్యూస్టన్‌లో భారతీయ అమెరికన్లు నిర్వహించనున్న ‘హౌదీ మోదీ’ కార్యక్రమంలో ప్రధాని మోదీతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వేదిక పంచుకోనున్నట్లు శ్వేతసౌధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి దాదాపు 50వేల మంది హాజరు కానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఒకే ప్రదేశంలో ఇంత భారీ ఎత్తున భారతీయ అమెరికన్లను ఉద్దేశించి ఓ అమెరికా అధ్యక్షుడు ప్రసంగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ట్రంప్‌ షెడ్యూల్‌ ప్రకారం హౌదీ మోదీ కార్యక్రమం అనంతరం ట్రంప్‌ న్యూయార్క్‌లో జరిగే ఐరాస సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. మోదీ ఈ నెల 27న, పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ 28న ఐరాసలో ప్రసంగించనున్నారు. అనంతరం ట్రంప్‌ పాక్‌ ప్రధానితో సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే భారత్‌-పాక్‌ ప్రధానులను త్వరలో కలనున్నానని ట్రంప్‌ ప్రకటించినట్లు తెలుస్తోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.