close

తాజా వార్తలు

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వినేశ్‌

నూర్‌ సుల్తాన్‌ (కజక్‌స్థాన్‌): భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ అద్భుతం చేసింది. ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో బంగారు పతకం సాధించాలన్న కల నెరవేరకున్నా టోక్యో ఒలింపిక్స్‌ బెర్త్‌ మాత్రం ఖాయం చేసుకుంది. బుధవారం జరిగిన రెపిఛేజ్‌ పోరులో అమెరికా క్రీడాకారిణి సారా హల్దెబ్రాండ్‌ 8-2తో ఓడించింది. సారా ప్రపంచ రజత పతక విజేత కావడం గమనార్హం.

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో వినేశ్‌ కాంస్యం గెలవాలంటే గ్రీస్‌ అమ్మాయి మరియా ప్రెవోలరకిని ఓడించాల్సి ఉంది. రెపిఛేజ్‌ తొలి రౌండ్లో యులియా (ఉక్రెయిన్‌)ను వినేశ్‌ 5-0తో చిత్తుచేసింది. కాంస్యంపై ఆశలు సజీవంగా ఉంచుకుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.