close

తాజా వార్తలు

తగ్గని దూకుడు: చైనా ఓపెన్‌ ప్రిక్వార్టర్స్‌కు సింధు

ఛాంగ్‌జౌ: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌ పీవీ సింధు చైనా ఓపెన్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరుకుంది. ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత లీ జురుయ్‌ (చైనా)పై 21-18, 21-12తో విజయం సాధించింది. దూకుడుగా ఆడిన ఈ తెలుగుతేజం మ్యాచ్‌ను కేవలం 34 నిమిషాల్లోనే ముగించడం గమనార్హం. ప్రపంచ 20వ ర్యాంకు షట్లర్‌ లీ జురుయ్‌ను ఓడించేందుకు సింధుకు మరీ శ్రమించాల్సిన అవసరం రాలేదు. తనదైన షాట్లతో విరుచుకుపడింది.

పురుషుల విభాగంలో జరిగిన పోరులో బి.సాయి ప్రణీత్‌ 21-19, 21-23, 21-14 తేడాతో థాయ్‌లాండ్‌ ఆటగాడు సుపన్యు అవిహింగ్‌సనన్‌ను ఓడించాడు. తర్వాతి రౌండ్‌కు అర్హత సాధించాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ప్రణవ్‌ జెర్రీ చోప్రా, ఎన్‌.సిక్కిరెడ్డి ద్వయం 12-12, 21-13 తేడాతో జర్మనీకి చెందిన మార్క్‌ లమ్స్‌ఫస్‌, ఇసబెల్‌ హెట్రిక్‌ చేతిలో ఓడింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.