close

తాజా వార్తలు

ట్రంప్‌ నోట మరోసారి ఆ వ్యాఖ్యలు

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కశ్మీర్‌ మధ్యవర్తిత్వం అంశంపై మరోసారి స్పందించారు. పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో ట్రంప్‌ సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్‌ నోట మళ్లీ కశ్మీర్‌ అంశం చర్చకు వచ్చింది. భారత్‌, పాక్‌లు కోరుకుంటే మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. కశ్మీర్‌ అంశం చాలా సంక్లిష్టమైందని, ఈ అంశంలో మధ్యవర్తిత్వం చేయగల సమర్థత తనకుందని ట్రంప్‌ పేర్కొన్నారు. ‘హౌడీ-మోడీ’ కార్యక్రమంలో భారత్‌, అమెరికా స్వప్నాలను సాకారం చేసేందుకు ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తామని ట్రంప్‌ పేర్కొన్న మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.