close

తాజా వార్తలు

ఆరునెలలు వ్యాపారం ఆపండి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ముంబయికి చెందిన పంజాబ్‌ అండ్‌ మహారాష్ట్ర కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ వ్యాపార కార్యకలాపాలను ఆపేయాలని ఆదేశించింది. బ్యాంకు నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకోవడంతో ఈ నిర్ణయం తీసుకొంది. పీఎంసీ బ్యాంక్‌లో రూ.20 వేల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి.  ఈ బ్యాంకులో ఖాతాలు ఉన్న వారు రూ.1000కి మించకుండా విత్‌డ్రా చేసుకొనే అవకాశం మాత్రం కల్పించింది. దీంతోపాటు ఆ బ్యాంకు కొత్త ఏ రుణాన్ని ఇవ్వడం, రెన్యూవల్‌ చేయడం కూడా చేయకూడదు. ఈ ఆంక్షలు ఆరునెలల పాటు అమల్లో ఉంటాయి. సెప్టెంబర్‌ 23 నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ బ్యాంకుకు 3.76శాతం స్థూల మొండి బకాయిలు ఉన్నాయి. నికర మొండి బకాయిలు 2.19శాతానికి చేరాయి. 

దీనిపై బ్యాంక్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఆర్‌బీఐ రుణాలకు సంబంధించి కొన్ని లోపాలను గుర్తించింది. దీంతో పీఎంసీ వీటిని సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ ఆంక్షలపై బ్యాంక్‌ సీఈవో జాయ్‌ థామస్‌ మాత్రం స్పందించలేదు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.