close

తాజా వార్తలు

ట్రంప్‌ అవే వ్యాఖ్యలు..24గంటల్లో రెండోసారి!

మళ్లీ మధ్యవర్తిత్వం ప్రతిపాదన తెచ్చిన అమెరికా అధ్యక్షుడు

న్యూయార్క్‌: 24 గంటల వ్యవధిలోనే రెండోసారి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌-పాక్‌ మధ్యవర్తిత్వ ప్రస్తావన తెచ్చారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరయ్యేందుకు భార్య మెలానియా ట్రంప్‌తో న్యూయార్క్‌కు చేరుకున్న అనంతరం ట్రంప్‌ మళ్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు ముందు ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘‘మధ్యవర్తిత్వం వహించాలని పాకిస్థాన్‌ కోరిన ప్రకారం నేను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. వారు నా ప్రమేయం ఆశిస్తున్నారు. కశ్మీర్‌ విషయంలో రెండు దేశాల అభిప్రాయాలు పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ఆ ప్రాంతం ఇద్దరికీ కావాలి. దీనిపై నాకు ఆందోళనగా ఉంది’’ అని ట్రంప్‌ అన్నట్లు ఓ జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. 
ట్రంప్‌ పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో సోమవారం సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ట్రంప్‌ నుంచి కశ్మీర్‌ అంశం 24 గంటల్లో మొదటిసారి చర్చకు వచ్చింది. కశ్మీర్‌ అంశం చాలా సంక్లిష్టమైందని, ఈ అంశంలో మధ్యవర్తిత్వం చేయగల సమర్థత తనకుందని ఆ సందర్భంగా ట్రంప్‌ పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యల అనంతరం భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ విషయంపై మూడో వ్యక్తి ప్రమేయం అవసరం లేదని ప్రధాని మోదీ స్వయంగా ట్రంప్‌ సమక్షంలో జి-7 సదస్సు సందర్భంగా స్పష్టం చేశారని తెలిపింది. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా ట్రంప్‌తో ప్రధాని మోదీ బుధవారం మళ్లీ భేటీ కానున్న నేపథ్యంలో దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.