close

తాజా వార్తలు

పాకిస్థాన్‌ది ఉగ్ర సంప్రదాయం

కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సదస్సులో భారత్‌

కంపాలా: కశ్మీర్‌ విషయంలో పాకిస్థాన్‌ చూపుతున్న అత్యుత్సాహాన్ని భారత్‌ మరోసారి ఎండగట్టింది. ఉగాండాలో జరిగిన కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ సదస్సు వేదికగా పాక్ చర్యలను తిప్పికొట్టింది. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాతోపాటు భారత ఎంపీలు అధిర్‌ రంజన్‌ చౌదరి, రూపా గంగూలీ, ఎల్‌ హనుమంతయ్య తదితరులు పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌పై విరుచుకు పడ్డారు. కశ్మీర్‌ వ్యాలీలో భారత్‌ ఆర్మీ దళాన్ని పెంచిన అంశంపై పాకిస్థాన్‌ విమర్శలు గుప్పించగా.. భారత ప్రతినిధులు దాన్ని తీవ్రంగా ఖండించినట్లు లోక్‌సభ సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. 

‘ 33 ఏళ్లుగా పాకిస్థాన్‌ మిలిటరీ పరిపాలనలోనే ఉందని రూపా గంగూలీతో సహా భారత ప్రతినిధులు పాక్‌ తీరు దుయ్యబట్టారు. అక్కడ ఉగ్ర సంప్రదాయం నెలకొని ఉందన్నారు. కశ్మీర్‌ విషయంలో ఆ దేశం చూపుతున్న ఆసక్తిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి పాకిస్థాన్‌ ప్రచారం కల్పిస్తుందన్నారు’అని లోక్‌సభ సచివాలయం పేర్కొంది. శనివారం మొదలైన ఈ సదస్సు నేటితో పూర్తి కానుంది. 
 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.