close

తాజా వార్తలు

నగరమే... అద్దెల్లేవ్‌ బిల్లుల్లేవ్‌!

ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు... ఇంటి అద్దె, కరెంటు బిల్లు, చెత్త తీసుకెళ్లేవాడికి డబ్బులు...ఇలా మనకు బోలెడు ఛార్జీలు. ఇవన్నీ లేకుండా ఉంటే ఎంత బాగుంటుంది. నిజంగానే ఇలాంటి ఇలాంటి నగరం ఒకటుంది. ఈఊరి పేరు స్లాబ్‌ సిటీ. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. శాన్‌డియాగోకి ఈశాన్యంగా 150 మైళ్లు వెళితే దీన్ని చేరుకోవచ్చు. సొనోరన్‌ అనే ఎడారి ప్రాంతంలో ఉంటుందీ నగరం. పేరుకి నగరమేగాని అక్కడ అలాంటి వాతావరణమేమీ కనిపించదు. అక్కడక్కడా ఎడారి మొక్కలు, చుట్టూ పర్వతాలు ఉంటాయి. వరుసల్లో కాకుండా అక్కడక్కడా వెదజల్లినట్టు ఇళ్లు కనిపిస్తాయి. ఇక్కడ స్థిర నివాసాలుండే వారు 150 మంది వరకూ ఉన్నారు. వీరిని స్నోబర్డ్స్‌ అని పిలుస్తారంతా. అంటే అమెరికాలోని చలి ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వారన్నమాట. అయితే ఈ ఊరికి ప్రభుత్వం ఉండదు. ఇంటింటికీ నీరు, కరెంటులాంటి సరఫరాలు అసలే కనిపించవు. ఆస్తి పన్నుల్లాంటివీ ఉండవు. చట్టాలు, నిబంధనలు ఏమీ ఉండవు. ఎవరైనా ఈ ఊరికొస్తే ఎక్కడోచోట ఉండిపోవచ్చు. అద్దెలు.. కరెంటు బిల్లుల్లాంటివేవీ  కనపడవు. అయితే సౌకర్యాలూ ఉండవు మరి.  1930ల వరకూ ఈ ఊరు ఓ మిలటరీ బేస్‌ క్యాంప్‌గా ఉండేది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఖాళీ అయిపోయింది. అప్పుడు స్లాబులు వేసిన చిన్న చిన్న గదులే ఇప్పుడు ఇక్కడ స్థిర నివాసం ఉంటున్న వారి ఇళ్లు. వాటినే వీరు ఆవాసాలుగా మార్చుకున్నారు. కరెంటుని ఎవరికి వారు జనరేటర్ల ద్వారా ఉత్పత్తి చేసుకుంటారు. చెత్తను ఎవరికి వారు కంపోస్ట్‌ చేసుకుంటారు.  కొంచెం దగ్గర్లో ఉండే వేరే టౌన్‌ నుంచి సరకులు, నిత్యావసరాల్ని తెచ్చుకుంటారు.  ఈ స్నోబర్డ్‌లని పిలిచేవారంతా మంచి కళాకారులు. చిత్రలేఖనం, పాత వస్తువుల్ని కళాకృతులుగా మార్చడంలో దిట్టలు. కళాకారులు ఊరికే ఉండరు కదా. ఇక్కడుండే చిన్న కొండల్ని మొత్తం రంగులతో నింపేశారు. చక్కని బొమ్మలతో ఆకర్షణీయంగా తయారు చేసేశారు. దీన్ని అక్కడి వారంతా అమెరికాలో ‘లాస్ట్‌ ఫ్రీ ప్లేస్‌’ అని అభివర్ణిస్తుంటారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.