
తాజా వార్తలు
మరోసారి పాక్ ప్రధానిపై గౌతమ్ గంభీర్ మండిపాటు
దిల్లీ: ఐరాస సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడిన తీరుపై భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్ తనదైన శైలిలో విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలోనూ ఇమ్రాన్ ఖాన్‌ను ఎద్దేవా చేస్తూ ఆయన విమర్శలు చేశారు. ఉగ్రవాదులకు ఇమ్రాన్ ఖాన్ రోల్ మోడల్ అని ఆరోపించారు.
‘‘ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని ఎండగడుతూ ఇమ్రాన్ ఖాన్ ఐరాస సమావేశంలో సుదీర్ఘ సమయంపాటు నీచమైన కథను అల్లారు. అంతేకాక ప్రపంచ దేశాధినేతల ముందు తనకు ఇచ్చిన సమయం మించి మాట్లాడారు. ఉగ్రవాదులకు అతను రోల్ మోడల్‌గా ఉన్నారు.’’ అని ముఖాముఖిలో అన్నారు.
సోమవారం రాత్రి ట్విటర్ వేదికగా గంభీర్ మరోసారి ఇమ్రాన్‌పై విరుచుకుపడ్డారు. కరాచీలో శ్రీలంక క్రికెట్ ఆటగాళ్లకు సంబంధించిన ఓ వీడియోను షేర్ చేసి.. ‘‘కశ్మీర్‌పై విమర్శలు చేస్తున్న వ్యక్తి, కరాచీలో పరిస్థితి గురించి మర్చిపోయినట్లున్నారు.’’ అని ట్వీట్ చేశారు. పాక్‌తో ఆడుతున్న మూడు వన్డే మ్యాచ్‌లలో భాగంగా కరాచీకి చేరుకున్న శ్రీలంక ఆటగాళ్లను అత్యంత భద్రత నడుమ తీసుకెళ్తున్న వీడియోను గంభీర్ ట్వీట్ చేశారు. నిమిషానికి పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో ఆటగాళ్లు ఉన్న మినీ బస్సులను సుమారు 20 ఎస్కార్ట్ వాహనాలు బందోబస్తుగా తీసుకెళ్తుండడం వైరల్‌గా మారింది.
మరోవైపు క్రికెటర్ శిఖర్ ధావన్ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. పక్క దేశాలు మనకు సలహా ఇవ్వనవసరం లేదు. ముందు మీ దేశంలో పరిస్థితులు చక్కదిద్దుకోండి.. తర్వాత ఇతర దేశాల గురించి ఆలోచించండి’’ అని విమర్శలు చేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మహేశ్-విజయశాంతి ఇది గమనించారా?
- భారత్‌పై వెస్టిండీస్ విజయం
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- అనుమానాలు ఉంటే వీడియోను చూడండి..
- దిశ హత్య నిందితుల ఎన్‌కౌంటర్‌పై సిట్ ఏర్పాటు
- టీ కోసం ఆగిన నిఖిల్‌కు వింత అనుభవం
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
