
తాజా వార్తలు
ఇంటర్నెట్ డెస్క్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చైనా పర్యటన ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ప్రత్యేక విమానంలో ఆయన చైనాకు చేరుకున్నారు. ఆ దేశ సాంస్కృతిక శాఖ మంత్రి ఇమ్రాన్‌కు స్వాగతం పలికారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం చోటుచేసుకొంది. పర్యటనకు ముందు వరకు ఇమ్రాన్ సహా కొంతమంది ఉన్నతాధికారులు మాత్రమే ఈ బృందంలో ఉన్నారు. కానీ, చివరి 24గంటల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రధాని సహా అనేక మంది మంత్రులు ముఖ్యంగా ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాని బృందంలో చేర్చారు. పైగా ఇమ్రాన్ అక్కడికి చేరుకోవడానికి ముందే బజ్వా చైనాకు వెళ్లి అక్కడి సైనికాధికారులతో చర్చలు చేపట్టారు. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఇమ్రాన్ భేటీ సమయంలో బజ్వా కూడా అక్కడే ఉండనున్నారు. ఒక దేశ సైన్యాధ్యక్షుడు ప్రధానితో కలిసి చర్చల్లో పాల్గొనడం చాలా అరుదు. కానీ, బజ్వా పాక్ విదేశాంగ విధానంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. పైగా చివరి క్షణంలో బజ్వాని పర్యటన బృందంలో చేర్చడం.. చైనా దాన్ని అనుమతించడాన్ని బట్టి చూస్తే ఆయన పాత్ర ఎంత కీలకమో అర్థమవుతోంది.
కశ్మీర్‌పై మద్దతు కూడగట్టడంలో ఇమ్రాన్ దారుణంగా విఫలమైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ‘మాకు మద్దతు లభించడం లేదు’ అంటూ ఐరాస వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది పాక్ వైఫల్యానికి నిదర్శనం. ఇక ఇమ్రాన్ వల్లకాదని భావించిన ఆర్మీనే స్వయంగా రంగంలోకి దిగినట్లు అర్థవుతోంది. ఇమ్రాన్ అదే మూస పద్ధతిని అనుసరిస్తే.. పాక్‌కు ఎఫ్ఏటీఎఫ్ బ్లాక్‌లిస్ట్ ముప్పు తప్పదేమోనని భావించినట్లున్నారు. అందుకే చైనాను సంతృప్తిపరిచి మద్దతు కూడగట్టేందుకు బజ్వా రంగంలోకి దిగారు. చైనా సైతం ఇమ్రాన్‌తో సమానంగా బజ్వాకు ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే ఇరు దేశాల మధ్య కీలకంగా ఉన్న చైనా, పాకిస్థాన్ నడవాతో సంబంధం ఉన్న దాదాపు అన్ని మంత్రిత్వ శాఖల మంత్రులను పర్యటనకు ఆహ్వానించింది. ఒకరోజు ముందే చైనా చేరుకున్న ఆర్మీ చీఫ్ బజ్వా ప్రధాని ఇమ్రాన్ వచ్చే సమయానికి అన్ని ఒప్పందాలు, కీలక విషయాలపై చర్చలు జరపడం గమనార్హం.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- బాలికపై అత్యాచారానికి తల్లి సహకారం
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- సైబరాబాద్ పోలీస్ వాట్సప్ నిలిపివేత
- త్వరలో వైకాపాలోకి గోకరాజు సోదరులు!
- త్వరలో అందుబాటులోకి మెట్రో రెండో కారిడార్
- ఎస్కేయూ ఉపకులపతి జయరాజ్ హఠాన్మరణం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
