close

తాజా వార్తలు

కోహ్లీ.. పాక్‌లో ఆడవా?

టీమిండియా సారథికి పాక్‌ అభిమాని విన్నపం

ముంబయి: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీకి భారత్‌లోనే కాదు విదేశాల్లోనూ భారీగా అభిమానులున్నారు. అతడి బ్యాటింగ్ స్టైల్, వ్యక్తిత్వానికి ఫిదా అయిన విదేశీ అభిమానులు చాలా మందే ఉన్నారు. దాయాది దేశం పాకిస్థాన్‌లోనూ కోహ్లీకి వీరాభిమాని ఉన్నాడట. వివరాల్లోకి వెళ్తే.. పాక్‌- శ్రీలంక మధ్య బుధవారం మూడో టీ20 మ్యాచ్‌ లాహోర్‌లో జరిగింది. ఈ సందర్భంగా షాబాజ్‌ షరీఫ్ అనే అభిమాని ‘కోహ్లీ.. మీరు పాకిస్థాన్‌లో ఆడితే చూడాలని ఉంది’ అని రాసిన ప్లకార్డు పట్టుకుని స్టేడియంలో తిరుగుతూ ప్రదర్శించాడు. ఈ సందర్భంగా తీసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ మేరకు షాబాజ్‌ కూడా ట్వీట్‌ చేశాడు. ‘విరాట్‌.. మీరు పాకిస్థాన్‌కు వచ్చి ఇక్కడ మ్యాచ్‌ ఆడతారని ఆశిస్తున్నా. నేను మీకు పెద్ద అభిమానిని’ అని ట్వీట్‌ చేసి సదరు ప్లకార్డును పోస్ట్‌ చేశాడు. దీంతో ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.