close

తాజా వార్తలు

బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో మంజురాణి ఓటమి

ఉలాన్‌ ఉదె(రష్యా): ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ బాక్సర్‌ మంజురాణి ఓటమిపాలైంది. 48 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్‌ పోరులో రష్యా బాక్సర్‌ ఎకతెరిన పాల్సివ చేతిలో మంజు 4-1తేడాతో ఓటమి చెందింది. దీంతో ఆమె వెండి పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. శనివారం జరిగిన సెమీస్‌లో భారత బాక్సర్‌.. థాయ్‌లాండ్‌కు చెందిన చతామత్‌ రక్‌సాత్‌ను 4-1తో ఓడించడం విశేషం. ఇదిలా ఉండగా అదే రోజు మేరీకోమ్‌ 51 కేజీల విభాగంలో, జమున 54 కేజీల విభాగంలో, లోవ్లినా 69 కేజీల విభాగాల్లో సెమీస్‌లోనే ఓటమిపాలయ్యారు. దీంతో ఈ ముగ్గురూ కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.