close

తాజా వార్తలు

అదరగొట్టిన తెలుగు షట్లర్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ ఛాంపియన్‌, భారత షట్లర్‌ పీవీ సింధు డెన్మార్క్‌ ఓపెన్‌ రెండో రౌండ్‌లోకి ప్రవేశించింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఇండోనేషియా క్రీడాకారిణి మరిస్కాను 22-20, 21-18 తేడాతో మట్టికరిపించింది. వరుస సెట్లలో విజృంభించి మరిస్కాపై ఉన్న 4-0 అజేయ రికార్డును 5-0గా మార్చుకుంది. రెండో రౌండ్‌లో కొరియా షట్లర్‌తో తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్‌ అదరగొట్టాడు. ఐదు సార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన లిన్‌డాన్‌ను 21-14, 21-17 తేడాతో ఓడించి రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. ఈ హైదరాబాదీ షట్లర్‌ క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ కెంటోతో తలపడే అవకాశం ఉంది. 

పురుషుల డబుల్స్‌లోనూ భారత్‌ శుభారంభం చేసింది. కొరియా జంటని సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌శెట్టి జోడీ 24-22, 21-11 తేడాతో ఓడించింది. కొరియా ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన కశ్యప్‌ డెన్మార్క్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టాడు. థాయ్‌లాండ్‌ షట్లర్‌ తమసిన్‌ చేతిలో 13-21, 12-21 తేడాతో ఓటమిపాలయ్యాడు. కశ్యప్‌తో పాటు సౌరభ్ వర్మ కూడా తొలి రౌండ్లోనే నిష్క్రమించాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.