close

తాజా వార్తలు

మూడో టెస్టు: వెలుతురు లేమితో నిలిచిన ఆట

రాంచీ: భారత్‌-దక్షిణాఫ్రికాల మధ్య రాంచీలో జరుగుతున్న మూడో టెస్టులో మొదటిరోజు ఆటను నిలిపివేశారు. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను నిలిపివేసినట్లు అంపైర్లు తెలిపారు. ఆ తర్వాత వర్షం కూడా ప్రారంభమైంది. దీంతో ఈ రోజు ఆట పూర్తిగా కొనసాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమ్‌ ఇండియా మ్యాచ్‌ నిలిపివేసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రోహిత్‌శర్మ 117(164), రహానె 83(135) పరుగులతో క్రీజులో ఉన్నారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా నోర్జేకు ఒక వికెట్‌ దక్కింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.