close

తాజా వార్తలు

కోహ్లీసేనలో పెనుమార్పులు తెస్తున్న రోహిత్‌శర్మ

రాంచీ: దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ (117 బ్యాటింగ్‌) ఆటను బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాఠోడ్‌ ప్రశంసించాడు. మానసికంగా సర్దుబాట్లు చేసుకోవడంతో అతడు విజయవంతం అవుతున్నాడని వెల్లడించాడు. రాంచీ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హిట్‌మ్యాన్‌ శకతం బాదిన సంగతి తెలిసిందే. రహానె (83 బ్యాటింగ్‌)తో కలిసి 185 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించాడు.

‘రోహిత్‌ అనుభవశాలి. అతడి టెక్నిక్‌లో మార్పులు అవసరం లేదు. తన ప్రణాళికలను మానసికంగా సర్దుబాటు చేసుకుంటే చాలు. అతడు అన్ని ఫార్మాట్లలో రాణించగల అద్భుతమైన ఆటగాడు. టెస్టుల్లో ఓపెనర్‌గా హిట్‌మ్యాన్‌ను పంపించడం మంచి నిర్ణయం. భారీ స్కోర్లు చేస్తూ అతడు సమస్యను పరిష్కరిస్తున్నాడు. టాప్‌ ఆర్డర్‌లో అతడు నిలకడగా రాణిస్తే భారత జట్టులో ప్రతిదీ మారుతుంది. విదేశాల్లో పర్యటిస్తున్నప్పుడూ తప్పదు’ అని విక్రమ్‌ అన్నాడు.

‘పిచ్‌పై మొదట తేమ ఉంది. సఫారీ బౌలర్లు మంచి ప్రాంతాల్లో కట్టుదిట్టంగా బంతులు విసిరి ఇబ్బందులు సృష్టించారు. రోహిత్‌ సైతం మొదట తడబడ్డాడు. వికెట్‌ కాస్త మారిన తర్వాత పరుగులు చేశాడు. టెస్టుల్లో కఠిన స్పెల్స్‌ ఎదుర్కోక తప్పదు. ఈ సిరీస్‌లో అతడు దాన్ని బాగానే అధిగమించాడు. అజింక్య రహానె తన ఆటలో తీవ్రత చూపించాడు. అతడో చక్కని ఆటగాడు. ముంబయి క్రికెటర్లు అద్భుతమైన క్రికెట్‌ ఆడతారు. దేశవ్యాప్తంగానూ తిరుగులేని ఆటగాళ్లు ఉన్నారు. రోహిత్‌, రహానె చేసిన పరుగులను ముంబయి ఆటగాళ్ల భాగస్వామ్యంగా చూడొద్దు. విదేశాల్లోనూ టాప్‌ఆర్డర్‌ను ఇలాగే కొనసాగిస్తాం. ఈ సిరీస్‌లో మయాంక్‌ రెండు, రోహిత్‌ మూడు శతకాలు బాదారు. అలాంటప్పుడు వారినెందుకు మార్చాలి. రబాడ చాలా మంచి బౌలింగ్‌ చేశాడు. అందుకే అతడికి అంత ఎక్కువ రేటింగ్‌ ఇస్తున్నారు. పిచ్‌పై సహకారం లభించినప్పుడు అవతలి ఎండ్‌ నుంచి అతడికి సరైన భాగస్వామి దొరకలేదు’ అని రాఠోడ్‌ అన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.