close

తాజా వార్తలు

క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన భారత బాక్సర్లు

వుహాన్‌: చైనాలో జరుగుతున్న ప్రపంచ సైనిక క్రీడల్లో భారత బాక్సర్లు క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల 51 కేజీల విభాగం రెండో రౌండ్‌లో తునీసియా బాక్సర్‌ బుగాన్మి బిలాల్‌ను భారత యువ బాక్సర్‌ అమిత్‌ పంగాల్‌ 4-1 తేడాతో ఓడించాడు. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో అమిత్ రజతం సాధించిన విషయం తెలిసిందే. 49 కేజీల విభాగంలో వియత్నాం క్రీడాకారుడు లిన్హ్‌ ఫుంగ్‌ను దీపక్‌ 5-0 తేడాతో ఓడించాడు. 56 కేజీలో విభాగంలోనూ భారత బాక్సర్‌ క్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు. వెనిజులా బాక్సర్ బొనిలాపై చిరాగ్‌ 5-0తో విజయం సాధించాడు. ప్రపంచ సైనిక క్రీడలను 25 విభాగాల్లో నిర్వహిస్తున్నారు. 109 దేశాలకు చెందిన 9,308 సైనిక క్రీడాకారులు దీనిలో పాల్గొంటున్నారు. భారత్‌ తరఫున తొమ్మిది క్రీడా విభాగాల్లో 54 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.