close

తాజా వార్తలు

బంగ్లా టూర్‌కు సిద్ధమవుతున్న రహానె

ఇంటర్నెట్‌డెస్క్‌: దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేశాక వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చేశాడు. అక్టోబర్‌ 5న తండ్రిగా ప్రమోషన్‌ పొందిన అతడు తదుపరి బంగ్లాదేశ్‌ సిరీస్‌కు సన్నద్ధమౌతున్నాడు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోమవారం ట్విటర్‌లో ఓ వీడియోను పోస్టు చేశాడు. ‘కుటుంబంతో విలువైన సమయాన్ని గడిపాక.. కార్యాలయానికి తిరిగి రావడానికి సమయం ఆసన్నమైంది’ అని పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆడుతుండగా రహానె భార్య రాధిక అక్టోబర్‌ 5న పాపకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని హర్భజన్‌ ట్వీట్‌ చేయగా అభిమానులు అభినందనలు తెలిపారు. మ్యాచ్‌ పూర్తయ్యాక ఇంటికి చేరుకున్న వైస్‌ కెప్టెన్‌ తన ముద్దుల పాపని ఎత్తుకొని ఆనందిస్తున్న ఫొటోని ట్వీట్‌ చేశాడు. కాగా ఈ సిరీస్‌లో నాలుగు ఇన్నింగ్స్‌ ఆడిన అతడు 216 పరుగులు చేయగా మూడో టెస్టులో శతకం బాదాడు. స్వదేశంలో మూడేళ్ల తర్వాత రహానె టెస్టుల్లో శతకం సాధించడం ఇదే తొలిసారి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.