close

తాజా వార్తలు

2020 ప్రపంచకప్‌లను ఆవిష్కరించిన కరీనా

మెల్‌బోర్న్‌: వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించే టీ20 ప్రపంచకప్‌లను బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ శుక్రవారం ఆవిష్కరించారు. ఆస్ట్రేలియా వేదికగా 2020లో మహిళలు, పురుషుల విభాగాల్లో రెండు ప్రపంచకప్‌ ఈవెంట్లు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెల్‌బోర్న్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కరీనా పాల్గొని ప్రపంచకప్‌లను ఆవిష్కరించారు. అభిమానులతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ ఫొటోలను పంచుకున్నారు. 

‘ఈ కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నా. తమ కలలను సాకారం చేసుకునేందుకు ఆయా దేశాల తరఫున ఆడుతున్న మహిళా క్రికెటర్లను ప్రశంసిస్తున్నా. అంతర్జాతీయ వేదికపై మహిళలను ఇలా చూడటం నిజంగా శక్తిమంతంగా అనిపిస్తుంది. ప్రతీ ఒక్కరికీ ఆ క్రికెటర్లు స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. మా మామయ్య మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ కూడా క్రికెటరే. భారత్‌ తరఫున ఆడిన గొప్ప ఆటగాడు‌. ఈ ట్రోఫీని ఆవిష్కరించడం నాకు గర్వకారణం’ అని పేర్కొన్నారు.

కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు మహిళా ప్రపంచకప్‌ జరగనుంది. అలాగే అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 వరకు పురుషుల మెగా ఈవెంట్‌ జరుగుతుంది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.