close

తాజా వార్తలు

కోహ్లీ లేకుంటే టీమిండియా కాస్త బలహీనం

ముంబయి: స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబ్‌ అల్‌ హసన్‌ లేకపోవడం బంగ్లాదేశ్‌ జట్టుకు భారీ లోటని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ డీన్‌ జోన్స్‌ అన్నాడు. అతడి బౌలింగ్‌ కన్నా బ్యాటింగ్‌ జట్టుకెంతో అవసరమని పేర్కొన్నాడు. విరాట్‌ కోహ్లీ లేకపోవడం టీమిండియాలో ఇతరులు సత్తా చాటుకొనేందుకు మంచి అవకాశామని వెల్లడించాడు.

‘విరాట్‌ కోహ్లీ లేకపోతే ఏ ఫార్మాట్లోనైనా టీమిండియా కాస్త బలహీనపడుతుంది. ఎందుకంటే అతడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడన్నది నిజం. జట్టులోని ఇతరులు సత్తా చాటేందుకు అతడి గైర్హాజరీ ఓ మంచి అవకాశం. ఉదాహరణకు విరాట్‌ గాయపడ్డాడు లేదా ప్రపంచకప్‌లో ఓ మ్యాచ్‌ ఆడలేడు అనుకుందాం. అప్పుడు ఎవరు బాధ్యతలు తీసుకుంటారు? రాజస్థాన్‌, బెంగళూరు మ్యాచ్‌ను ఆరు ఓవర్లకు కుదించారని అనుకుందాం. అప్పుడు మైదానంలోకి వెళ్లేందుకు జట్లకు ఎలాంటి వైఖరి అవసరమో తెలిసేదెలా? ప్రస్తుతం రోహిత్‌ నాయకత్వ బాధ్యతలు స్వీకరించాడు. అతడు నాలుగు ఐపీఎల్‌ ట్రోఫీలు గెలిచాడు. జట్టును నడిపించడం ఎలాగో తెలుసు. కేఎల్‌ రాహుల్‌ మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడో లేదో చూడాలి. పంత్‌ను నాలుగులో ఆడిస్తారా? సెలక్టర్లు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రెండు మూడు సిరీసుల వరకు దానినే కొనసాగించాలి. అప్పుడే జట్టులో తమ పాత్రేంటో ఆటగాళ్లకు అర్థమవుతుంది. తొలి స్థానంలో సరైన ఆటగాడిని ఎంచుకోవడమే అసలైన సూత్రం’ అని జోన్స్‌ అన్నాడు.

సారథి షకిబ్‌ అల్‌ హసన్‌ సేవలు కోల్పోవడం బంగ్లాదేశ్‌కు పెద్ద లోటని జోన్స్‌ అన్నాడు. ‘సారథి లేనప్పుడు బాధపడటమో లేదా నిర్భయంగా ముందుకెళ్లడమో చేయాలి. ఇలాంటప్పుడు శుభారంభాలు అవసరం. బంగ్లాదేశ్‌ చరిత్రలోనే షకిబ్‌ అతిపెద్ద స్టార్‌ ఆటగాడు. అతడు లేని లోటు పూడ్చలేనిది. షకిబ్‌ బౌలింగ్‌ కన్నా బ్యాటింగ్‌ ఎంతో అవసరం. కొత్త కోచింగ్‌ బృందం మ్యాచ్‌ ప్రణాళికలు ఎలా ఉంటాయో చూడాలి. కొన్ని సరదా వ్యూహాలు ఉంటాయనే అనుకుంటున్నా. ఏదేమైనప్పటికీ నమ్మకమే ముఖ్యం. సారథి జట్టును ముందుండి నడిపించాలి’ అని డీన్‌ పేర్కొన్నాడు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.