
తాజా వార్తలు
ఇస్లామాబాద్: మరో కొద్ది రోజుల్లో కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. భారత్ నుంచి వచ్చే సిక్కు యాత్రికులకు స్వాగతం పలికేందుకు అంతా సిద్ధం చేసినట్లు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్ ఖాతాలో కర్తార్‌పూర్ కాంప్లెక్స్, గురుద్వారా సాహిబ్ సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ‘‘సిక్కు యాత్రికులకు స్వాగతం పలికేందుకు కర్తార్‌పూర్ సిద్ధం’’ అని ట్వీట్ చేశారు. దీనితో పాటు రికార్డు సమయంలో కర్తార్‌పూర్ కారిడార్ సిద్ధం చేసినందుకు తన ప్రభుత్వాన్ని కూడా అభినందింస్తూ ట్వీట్ చేశారు.
నవంబరు 9న ఈ కారిడార్‌ను ప్రారంభించనున్నారు. 2019 నవంబరు 12 సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ దేవ్ 550వ జయంతి. దీనిని పురస్కరించుకొని పెద్ద సంఖ్యలో సిక్కు యాత్రికులు గురుద్వారా సందర్శనకు వెళతారని అంచనా. ఇప్పటికే ఈ యాత్రకు వచ్చే ప్రయాణికులపై ఇమ్రాన్ ప్రభుత్వం కొన్ని ఆంక్షలు ఎత్తివేసింది. దీని ప్రకారం వారికి పాస్‌పోర్ట్ అవసరం లేదు. గుర్తింపు కార్డు ఉంటే సరిపోతుంది. కేవలం 20 డాలర్ల ప్రవేశ రుసుము మాత్రమే వసూలు చేస్తుంది. అయితే కారిడార్ ప్రారంభోత్సవం నాడు వచ్చే యాత్రికులకు ఈ ఫీజు మినహాయింపును ప్రకటించారు. నిత్యం ఐదు వేల మంది సిక్కులు గురుద్వార్ సందర్శనకు వెళ్లేందుకు పాక్ అనుమతించింది.
కర్తార్‌పూర్ ఒప్పందంపై గతనెలలో భారత్-పాకిస్థాన్ ప్రతినిధులు సంతకం చేశారు. గురునానక్ తన చివరి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా దర్బార్ సాహిబ్‌లోనే గడిపారు. ఇది పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న నరోవల్ జిల్లాలో ఉంది. అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పోలీసులపై పూల జల్లు
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
