
తాజా వార్తలు
రాజ్‌కోట్: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌శర్మ(85) గురువారం బంగ్లాపై చెలరేగిన సంగతి తెలిసిందే. రెండో టీ20లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ తృటిలో ఐదో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో బంగ్లా నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని రోహిత్‌సేన రెండు వికెట్లు కోల్పోయి 15.4 ఓవర్లలో ఛేదించింది. హిట్‌మ్యాన్ సిక్సులతో చెలరేగిన వేళ పలు రికార్డులు బద్దలయ్యాయి.
* టీ20ల్లో అత్యధిక సిక్సులు బాదిన భారత కెప్టెన్‌గా రోహిత్(17 ఇన్నింగ్స్‌ల్లో 37 సిక్సులు) అగ్రస్థానంలో నిలిచాడు. అతడికన్నా ముందు ధోనీ (62 ఇన్నింగ్స్‌ల్లో 34 సిక్సులు) అగ్రస్థానంలో ఉండేవాడు. విరాట్‌కోహ్లీ (26 ఇన్నింగ్స్‌ల్లో 26 సిక్సులతో) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
* అలాగే అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఏడాది అత్యధిక సిక్సులు(66) బాదిన క్రికెటర్‌గా నిలిచాడు రోహిత్. 2017లో 65 సిక్సులు కొట్టిన హిట్‌మ్యాన్ 2018లో 74 బాదడం విశేషం.
* పొట్టి ఫార్మాట్లో ఐదో శతకం చేజార్చుకున్న టీమిండియా ఓపెనర్.. కోహ్లీతో సమానంగా 22 ఇన్నింగ్స్‌ల్లో 50కి పైగా పరుగులు చేశాడు.
* పొట్టి ఫార్మాట్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ ఆరోసారి అర్ధశతకం సాధించాడు. కోహ్లీ కూడా కెప్టెన్‌గా ఆరు అర్ధ శతకాలు కొట్టడం గమనార్హం.
* శిఖర్ ధావన్‌తో కలిసి టీ20ల్లో అత్యధికసార్లు వంద పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించాడు. ఇదివరకు కోహ్లీ-రోహిత్ జంట మూడుసార్లు ఈ ఘనత సాధించగా.. రోహిత్-ధావన్ జంట నాలుగుసార్లు సాధించింది. ఆసీస్ ఓపెనర్లు వాట్సన్-వార్నర్.. కివీస్ ఆటగాళ్లు గప్తిల్-విలియమ్సన్, గప్తిల్-మన్రో మూడేసి సార్లు శతక భాగస్వామ్యాలు నెలకొల్పారు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- తీర్పు చెప్పిన తూటా
- కిర్రాక్ కోహ్లి
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
ఎక్కువ మంది చదివినవి (Most Read)
