
తాజా వార్తలు
నాగ్‌పుర్: టీమ్ఇండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ ప్రోత్సాహంతోనే బంగ్లాదేశ్ ఆఖరి టీ20లో అద్భుత ప్రదర్శన చేశానని భారత పేసర్ దీపక్ చాహర్ తెలిపాడు. ‘‘రోహిత్ నా దగ్గరికి వచ్చి ‘చాహర్.. ఈ రోజుకి నువ్వే బుమ్రావి. కీలక సమయంలో నీతో బౌలింగ్ చేయిస్తా’ అని అన్నాడు. ఈ మాటలు నాకు ఎంతో ప్రేరణ కలిగించాయి. ఒత్తిడిలో నన్ను నమ్మి బాధ్యతను అప్పగించడాన్ని ఎంతో ఆస్వాదించాను. మనపై ఎవరూ నమ్మకం ఉంచకపోతే నిరాశ కలుగుతుంది. కెప్టెన్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే గొప్ప ప్రదర్శన చేశాను. టీ20 ప్రపంచకప్‌కు మరో 11 నెలల సమయం ఉంది. ట్రోఫీని గెలవాలని కృషి చేస్తున్నాం. కానీ, అంతకంటే ముందు ఎన్నో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్నాయి. ఐపీఎల్ కూడా ఉంది. వీటిపై కూడా దృష్టి సారించాలి. జట్టు యాజమాన్యం నాపై మరింత నమ్మకం పెంచుకోవాలని శ్రమిస్తున్నా. ప్రతి మ్యాచ్ నాకు కీలకమే. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలంటే తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను’’ అని చాహర్ తెలిపాడు.
నాగ్‌పుర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన నిర్ణయాత్మక పోరులో టీమ్ఇండియా 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా దీపక్ చాహర్ (3.2-0-7-6) ధాటికి 144 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్ 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించిన దీపక్ టీ20 చరిత్రలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అంతేకాకుండా హ్యాట్రిక్ సాధించిన తొలి భారత బౌలర్‌గానూ రికార్డు సృష్టించాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఫ్రెంచ్ గర్ల్ ఫ్రెండ్తోవిజయ్ దేవరకొండ
- గర్భంతో ఉన్న భార్య కోసం కుర్చీలా మారిన భర్త
- దిశ మృతదేహంలో మద్యం ఆనవాళ్లు
- పాస్‌పోర్ట్‌లో కొత్త మార్పులు
- ఎవరు.. ఎక్కడ?
- ₹93 వేలు పెట్టి ఐఫోన్ ఆర్డరిస్తే..!
- గంగవ్వకు హీరోయిన్ కావాలని ఉందట!
- నిర్భయ దోషులకు ఉరి తీసేది ఇతడే!
- బుడ్డోడి బ్యాటింగ్‌కి కోహ్లీ ఫిదా!
- కాల్చేస్తున్నాం.. కూల్చలేకపోయారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
