
తాజా వార్తలు
ఇండోర్: బంగ్లాదేశ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్‌కోహ్లీ, తదుపరి జరగబోయే టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి వచ్చాడు. ఈనెల 14న ఇండోర్‌లో తొలి టెస్టు ఆరంభం కానుండగా.. 22న కోల్‌కతాలో చారిత్రక డేనైట్ టెస్టు జరగనుంది. ఈ నేపథ్యంలో కోహ్లీ తొలి టెస్టుకు ముందు చిన్నపిల్లలతో కలిసి గల్లీ క్రికెట్ ఆడాడు. ఇండోర్‌లోని ఓ గృహ సముదాయ ప్రాంతంలో యాడ్ షూటింగ్‌కు వచ్చిన టీమిండియా కెప్టెన్ పిల్లలతో కలిసి సరదాగా గడిపాడు. వాళ్లేసిన బంతులకు కోహ్లీ షాట్లు ఆడి ఉత్సాహపరిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
కాగా బంగ్లాతో టీ20 సిరీస్‌కు దూరమైన కోహ్లీ.. తన పుట్టిన రోజును పురస్కరించుకొని సతీమణి అనుష్కశర్మతో కలిసి భుటాన్ పర్యటన వెళ్లాడు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. అదే సమయంలో తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌శర్మ టీ20 సిరీస్‌లో జట్టును సమర్థవంతంగా నడిపించాడు. తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైనా రెండు, మూడో టీ20ల్లో గెలిపించి సిరీస్‌ను సొంతం చేశాడు.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- విచారణ ‘దిశ’గా...
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- కొడితే.. సిరీస్ పడాలి
- పెళ్లే సర్వం, స్వర్గం
- ‘శరద్ పవార్ కొన్ని విషయాలు దాచారు’
ఎక్కువ మంది చదివినవి (Most Read)
