close

తాజా వార్తలు

మయాంక్‌ శతకం.. రహానె అర్ధ శతకం

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ మయాంక్‌ అగర్వాల్‌ (111; 205 బంతుల్లో 16x4, 1x6) శతకంతో చెలరేగుతున్నాడు. వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె (50; 105 బంతుల్లో 6x4) అర్ధ శతకంతో దూసుకుపోతున్నాడు. దీంతో టీమిండియా భారీ స్కోర్‌ దిశగా పయనిస్తోంది. 66 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ 225/3తో నిలిచింది. కెప్టెన్‌ కోహ్లీ(0) ఔటయ్యాక మయాంక్‌, రహానె శతక భాగస్వామ్యాన్ని జోడించారు.

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 86/1తో రెండో రోజు ఆట ప్రారంభించిన కొద్ది సేపటికే టీమిండియా పుజారా (54), కోహ్లీ(0)ల వికెట్లను కోల్పోయింది. అబు జయెద్‌ బౌలింగ్‌లోనే ఇద్దరూ ఔటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన రహానె, మయాంక్‌తో సమన్వయం చేసుకొని నిలకడగా ఆడుతున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.